Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: #Nellore #Puramithra #YONandan #NelloreMunicipalCorporation #CivicGrievances #PropertyTax #WaterCharges #TradeLicence #PunnamiNews

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పురమిత్రలోనే ఫిర్యాదులు, పన్నుల చెల్లింపులు

స్థానిక సమస్యలను నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పురమిత్ర యాప్‌ను వినియోగించుకోవాలని కమిషనర్ వై.ఓ. నందన్ సోమవారం కోరారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా నాలుగో మైలు ప్రాంతంలో కాలువల పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వాటిని యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లపై గుంతలు, మురుగు కాలువలు, భూగర్భ డ్రైనేజీ, పార్కుల నిర్వహణపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రభుత్వ స్థలాలు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, ఆస్తి పన్ను, సంక్షేమ పథకాలు, ఇతర మున్సిపల్ సేవలకు సంబంధించిన సమస్యలనూ నమోదు చేయవచ్చని తెలిపారు. సమస్య వివరాలతో పాటు ఫొటోలను జతచేస్తే సంబంధిత అధికారులు ఫిర్యాదును పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా ఇంటి నుంచే ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని కమిషనర్ తెలిపారు.