Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: Mock Assembly

తెలంగాణ

పల్లా రాజేశ్వర్‌రెడ్డి సెటైర్లతో మాక్ అసెంబ్లీ హోరు

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి పాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సబ్జెక్ట్ ప్రిపేర్ కాకుండానే సభకు వచ్చానని, సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ చెప్పినట్లే మాట్లాడతానని చమత్కరించారు. బ్యాంకు చెక్కులు తెలుసు కానీ క్యూసెక్కులు తెలియవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని, అందుకే చేయబోమంటూ ఎద్దేవా చేశారు. KRMB, GRMB సమావేశాల్లో సలహాదారుడు చెప్పినచోట సంతకం పెడతానన్నారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్, కమిషన్లు, కాంగ్రెస్ నాయకత్వంపై కూడా సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చంద్రబాబు కారణమని వ్యాఖ్యానిస్తూ, ఆయన రుణం తీర్చుకోవద్దా అంటూ ప్రశ్నించారు. సోనియా గాంధీ సర్టిఫికెట్ ఉంటే చాలంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణ

గంగుల సెటైర్లు.. ‘మైనింగ్ అంటే మై ఎర్నింగ్!’

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాత్రలో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కోసం సొంత డబ్బు ఖర్చు చేశానని, ఇప్పుడు సంపాదించుకోవాలని సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. కమిషన్లు, సెటిల్‌మెంట్లు, భూ భారతి, వెలుగుమట్ల అంశాలను ప్రస్తావిస్తూ “మైనింగ్ అంటే మై ఎర్నింగ్ అధ్యక్షా!” అంటూ చేసిన వ్యాఖ్యలు మాక్ అసెంబ్లీలో ఆకట్టుకున్నాయి.

హైదరాబాద్

మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్రలో చమత్కార వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా అనుకరిస్తూ, “హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నాం.. ఏ సంవత్సరం వంద రోజులో చెప్పలేదు కదా!” అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, రైతుల సమస్యలు, ఢిల్లీ నాయకత్వంతో ఇబ్బందులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.