Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: Krishna mandal

నారాయణపేట

బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శిగా జి. శ్రీనివాసులు

భారతీయ జనతా పార్టీ జిల్లా ఓబీసీ మోర్చా పూర్తి స్థాయి కమిటీని జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మాకం సురేందర్ మక్తల్‌లో ప్రకటించారు. ఈ కమిటీలో కృష్ణ మండల మాజీ అధ్యక్షులు ఖాన్ దొడ్డి జి. శ్రీనివాసులుకు జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కృష్ణ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప, ప్రధాన కార్యదర్శులు దండు రాఘవేంద్ర, సచిన్ బట్ హర్షం వ్యక్తం చేశారు. జి. శ్రీనివాసులుకు జిల్లా స్థాయిలో కీలక బాధ్యత కల్పించిన జిల్లా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూతన బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు కృష్ణ మండలంలోని ఓబీసీలకు పార్టీకి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తూ, ఓబీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

నారాయణపేట

కృష్ణ మండలంలో బీజేపీ యువమోర్చా పూర్తి స్థాయి మండల కమిటీ ఏర్పాటు

కృష్ణ మండలంలో భారతీయ జనతా పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, యువతను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా బీజేపీ యువమోర్చా పూర్తి స్థాయి మండల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడిగా నియమితులైన వొట్టేవోళ్ల సురేష్‌తో పాటు ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన జెరకల్ తరుణ్ (గుడేబల్లూర్), లోకేష్ గౌడ్ (కున్సి)లను కృష్ణ మండల బీజేపీ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతనంగా నియమితులైన మండల కమిటీ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజాసేవ, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేయాలని సూచించారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నూతన కమిటీ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మండల బీజేపీ అధ్యక్షుడు నల్లె నర్సప్ప, ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర, మాజీ అధ్యక్షులు జెగ్గిలి హుసేనప్ప, ఖాన్దొడ్డి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ తిమ్మప్ప కొత్తపల్లి, బీజేపీ యువమోర్చా జిల్లా కార్యదర్శి సుమంత్, వడ్వట్ రమేష్, పంతిగి ఆంజనేయులు, ముడుమల్ బీజేవైఎం గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు, కార్తిక్ కోలీ, ఈడిగి విజయ్, వడ్వట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

రూ.4 కోట్లతో అయీనాపూర్ – సుగూర్ లింగంపల్లి రహదారి నిర్మాణానికి శ్రీకారం

దశాబ్దాల ప్రజల ఎదురుచూపులకు తెర.. 4 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం! దశాబ్దాలుగా సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అయీనాపూర్, సుగూర్ లింగంపల్లి గ్రామాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే దిశగా మరో ముందడుగు పడింది. రూ.4 కోట్ల భారీ నిధులతో అయీనాపూర్ గ్రామం నుంచి సుగూర్ లింగంపల్లి గ్రామం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఆర్ అండ్ బీ (R&B) రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు, గిరి అన్న గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కృష్ణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ గౌడ గారి ఆధ్వర్యంలో రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంత ప్రజలు సరైన రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు, అత్యవసర వైద్య సేవలు, విద్యార్థుల ప్రయాణాలు, రైతుల వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.4 కోట్ల నిధులతో రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కావడం గ్రామాల అభివృద్ధికి కీలక ముందడుగుగా నిలవనుంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే రెండు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపార రంగాలకు ఎంతో మేలు చేకూరనుంది. గ్రామాల మధ్య అనుసంధానం మెరుగుపడి ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలగడంతో పాటు ప్రాంత అభివృద్ధికి కొత్త మార్గం ఏర్పడనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: అయీనాపూర్ సర్పంచ్ శరణ్య స్వామి, కృష్ణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ గౌడ, మండల ఉపాధ్యక్షులు నారాయణ, మండల ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, పల్లె సురేష్, కృష్ణ సర్పంచ్ నాగేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగప్ప, నాగేశ్వరరావు, నాగేందర్, తమ్మప్ప, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నాగప్ప, కృష్ణ మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాగ్లి మహేష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ప్రజల రహదారి సమస్యపై స్పందించి, రూ.4 కోట్ల నిధులు మంజూరు చేయించి నిర్మాణ పనుల ప్రారంభానికి కృషి చేసిన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి కృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యం.. గ్రామాల అభివృద్ధే ధ్యేయం.. ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే సంకల్పం

నారాయణపేట

కున్సి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక.. పాల్గొన్న గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు

గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి అన్న గారి ఆదేశాల మేరకు కృష్ణ మండలం కున్సి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కున్సి గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై నూతన గృహంలోకి అడుగుపెట్టిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అభినందనలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రతతో పాటు ఆత్మగౌరవాన్ని కల్పిస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

కున్సి గ్రామంలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

నూతనంగా మంజూరైన 24 మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకంలో భాగంగా కృష్ణా మండలం కున్సి గ్రామంలో నూతనంగా పెన్షన్లు మంజూరైన 24 మంది లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ పథకం ద్వారా అర్హులైన పేదలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందడంతో వారి జీవనానికి కొంత భరోసా లభిస్తుందని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అఖిలపక్ష నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

రాత్రివేళల్లో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా.. అడ్డుకునే వారేరీ?

కున్సి గ్రామం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఇసుక టిప్పర్ వేగంగా వెళ్తుండగా, దానిని వెంబడించినప్పటికీ వాహనం వేగం పెంచుకుంటూ వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇసుకను పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రివేళల్లో ఇంత బహిరంగంగా ఇసుక రవాణా జరుగుతున్నా అడ్డుకునే వారే లేరా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై నిఘా పెంచి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నారాయణపేట

పింఛన్ బాండ్ల పంపిణీకి కదిలిన కున్సి కాంగ్రెస్ బలగం.. మక్తల్‌కు భారీగా తరలివెళ్లిన నాయకులు!

మక్తల్‌లోని ద్వారక ఫంక్షన్ హాల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్ మంజూరు బాండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కున్సి గ్రామ కాంగ్రెస్ బలగం పెద్ద సంఖ్యలో తరలివెళ్లి తమ సంఘీభావాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని, భవిష్యత్తులో మిగిలిన హామీలను కూడా తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. ఒంటరి మహిళలు, అక్కాచెల్లెళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ స్వామినాథ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధప్ప మాస్టర్, బాడాల్ చిన్న నరసప్ప, ఖాన్దొడ్డి నారాయణ, గడ్డమీది శరణ్, నల్లె శ్రీనివాసులు, అలిగేరి మహదేవ్ జీ, లక్ష్మణ్, కాశీం, శివప్ప, నర్సింగప్ప తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

కృష్ణా మండల TSCPSEU నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

నవంబర్ 17న సామూహిక సెలవు పెట్టి ఉద్యమంలో పాల్గొనాలి: రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మహాదేవ్ కృష్ణా మండలం: తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎన్. కృపాకర రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా మండల CPS ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్. మహాదేవ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం. మునెప్ప మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని, CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS) సాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నవంబర్ 17న సామూహిక సెలవు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అధ్యక్షుడిగా నల్లే శివరాజ్, ప్రధాన కార్యదర్శిగా ఎల్. స్వామినాథ్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా అభిలాష్, కోశాధికారిగా తిరుపతయ్య ఎన్నికయ్యారు. మహిళా విభాగం కన్వీనర్లుగా ఎస్. మాధవి, గీత, ఉపాధ్యక్షులుగా అజయ్, ఆంజనేయులు, కార్యదర్శులుగా ఖాసీం, రవి, రవి ఎన్నికయ్యారు. సమన్వయ సభ్యులుగా రంగారావు, వెంకటయ్య, బాలువివేక్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో TSCPSEU రాష్ట్ర సహా అధ్యక్షుడు ఎస్. మహాదేవ్, PRTU నాయకులు రాఘవేంద్ర, అనిల్ కుమార్‌తో పాటు మండల CPS ఉద్యోగులు పాల్గొన్నారు.

నారాయణపేట

హాస్టల్‌కు వెళ్తానని చెప్పి వెళ్లి అదృశ్యమైన 7వ తరగతి విద్యార్థి.. ఆచూకీ కోసం తల్లిదండ్రుల ఆవేదన

క్రిష్ణ మండలం ఆలంపల్లి గ్రామానికి చెందిన భంగి గంగప్ప (గౌతమ్) అనే 7వ తరగతి విద్యార్థి ఈ నెల 11-11-2026న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. హాస్టల్‌కు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన బాలుడు, ఇప్పటివరకు హాస్టల్‌కు కూడా చేరుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు భంగి మహదేవ్, భంగి సంగీత ఆందోళన చెందుతున్నారు. బాలుడి వివరాలు: పేరు: భంగి గంగప్ప (గౌతమ్) చదువు: 7వ తరగతి గ్రామం: ఆలంపల్లి, క్రిష్ణ మండలం దుస్తులు: తెలుపు రంగు ప్యాంట్, నలుపు రంగు షర్ట్ ముఖ ఛాయ: ఎరుపు రంగులో ఉంటుంది. ఈ బాలుడు ఎక్కడైనా కనిపించినా, ఆచూకీ తెలిసినా వెంటనే కింది ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 7013910892 6302924297

నారాయణపేట

పాఠశాల పరిశుభ్రతకు సహకరించిన గ్రామ పంచాయతీకి ప్రత్యేక కృతజ్ఞతలు

ఎంపీపీ ఎస్ ఖాన్ దొడ్డి పాఠశాల పరిసరాల్లో పెరిగిన చెట్ల పొదల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వాటిని తొలగించాలని పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శిని కోరడం జరిగింది. పాఠశాల విజ్ఞప్తిపై వారు వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో చెట్ల పొదలను తొలగించడం జరిగింది. విద్యార్థుల సౌకర్యం, పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు సహకరించిన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శికి మండల విద్యాశాఖ తరఫున, పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. 💐💐💐