Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: KondaSurekha

హైదరాబాద్

సురేఖపై వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు?

తనను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు. ఇప్పటికే నోటీసుకు వివరణ ఇచ్చినప్పటికీ తనపై బహిరంగ విమర్శలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో తన రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయడం కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నమా అనే అంశాన్ని పరిశీలించాలని కోరారు. పార్టీ క్రమశిక్షణ, సామాజిక న్యాయం, మహిళల గౌరవానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వరంగల్

రేవంత్ రెడ్డి వచ్చాకే నేను మాట్లాడుతాను

తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాతే ఈ అంశంపై మాట్లాడతానని తెలిపారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చెప్పాల్సిన విషయాలను ఇప్పటికే వెల్లడించానన్నారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడబోనని, కొత్తగా చెప్పాల్సిన అంశాలేమీ లేవని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి వచ్చిన అనంతరం అవసరమైతే పూర్తి స్థాయిలో స్పందిస్తానని పేర్కొన్నారు.

హైదరాబాద్

మాజీ ఓఎస్డీ సుమంత్‌పై హత్యాయత్నం కేసు

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై మేడిపల్లి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తనపై రాడ్లతో దాడి చేశారని గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై సెక్షన్ 109 కింద కేసు నమోదైంది. ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును జూబ్లీహిల్స్ పీఎస్‌కు బదిలీ చేశారు.

తెలంగాణ

సురేఖ వివరణ లేఖ

టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసుపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని స్పష్టం చేశారు. కుటుంబ బంధం ఆధారంగా తనను రాజకీయంగా బాధ్యురాలిని చేయడం సముచితం కాదన్నారు. కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణపై సంపూర్ణ గౌరవం ఉందని పేర్కొంటూ, తన ప్రమేయం లేదని గుర్తించి నోటీసును ఉపసంహరించుకోవాలని కమిటీ చైర్మన్ మల్లు రవికి విజ్ఞప్తి చేశారు.