బస్ షెల్టర్ ప్రారంభం
ఎస్.ఎం.పురం పంచాయతీ పరిధిలోని లింగాలపేట గ్రామంలో శుక్రవారం కొత్త బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. ఈ షెల్టర్‌ను పంచాయతీ ఎం.పి.టి.సి కూన అప్పలనాయుడు నిర్మించగా, గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యనారాయణ ప్రారంభించారు. ప్రయాణికులు ఎన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్మాణం చేపట్టినట్లు ఎం.పి.టి.సి తెలిపారు. “ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన నాయకత్వం” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

