संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: #BRS

హైదరాబాద్

రేవంత్ పాలనపై దేశపతి తీవ్ర విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, శాసన మండలి విప్ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై కేసులు, అరెస్టులతో నిర్బంధ పాలన సాగుతోందన్నారు. కేసీఆర్‌పై నిరంతరం విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు కాంగ్రెస్ నేతల బౌన్సర్లలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అమరవీరుల పేరుతో రాజకీయాలు చేయకుండా, హైదరాబాద్ లేదా ఫోర్త్ సిటీలో అమరవీరుల కాలనీ నిర్మించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్

రేవంత్ పాలనపై దేశపతి తీవ్ర విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, శాసన మండలి విప్ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై కేసులు, అరెస్టులతో నిర్బంధ పాలన సాగుతోందన్నారు. కేసీఆర్‌పై నిరంతరం విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు కాంగ్రెస్ నేతల బౌన్సర్లలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అమరవీరుల పేరుతో రాజకీయాలు చేయకుండా, హైదరాబాద్ లేదా ఫోర్త్ సిటీలో అమరవీరుల కాలనీ నిర్మించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్‌పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అనుముల కుటుంబ అవినీతిని ఆధారాలతో ప్రశ్నించినందుకే క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఢిల్లీలో రాజ్యాంగంపై మాట్లాడుతున్న రాహుల్, తెలంగాణలో రేవంత్ రెడ్డి ద్వారా అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ, ఆధారాలతో ప్రశ్నించిన వారిని జైలుకు పంపడం ప్రజాస్వామ్య విరుద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు.

హైదరాబాద్

పాస్‌పోర్టు జప్తు వార్తపై కేటీఆర్ నోటీసు

తన పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్లు ఈనాడు ప్రచురించిన వార్త వాస్తవ విరుద్ధమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తరఫు న్యాయవాది లీగల్‌ నోటీసు పంపించారు. కోర్టు ఎలాంటి జప్తు ఉత్తర్వులు ఇవ్వలేదని, ఏసీబీ అధికారి కేవలం మెమో మాత్రమే దాఖలు చేశారని పేర్కొన్నారు. వార్తను 48 గంటల్లో ఉపసంహరించుకుని, అదే ప్రాధాన్యతతో సవరణ ప్రచురించడంతోపాటు బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే సివిల్‌, క్రిమినల్‌ పరువునష్టం చర్యలు చేపడతామని నోటీసులో హెచ్చరించారు.

తెలంగాణ

పల్లా రాజేశ్వర్‌రెడ్డి సెటైర్లతో మాక్ అసెంబ్లీ హోరు

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి పాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సబ్జెక్ట్ ప్రిపేర్ కాకుండానే సభకు వచ్చానని, సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ చెప్పినట్లే మాట్లాడతానని చమత్కరించారు. బ్యాంకు చెక్కులు తెలుసు కానీ క్యూసెక్కులు తెలియవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని, అందుకే చేయబోమంటూ ఎద్దేవా చేశారు. KRMB, GRMB సమావేశాల్లో సలహాదారుడు చెప్పినచోట సంతకం పెడతానన్నారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్, కమిషన్లు, కాంగ్రెస్ నాయకత్వంపై కూడా సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చంద్రబాబు కారణమని వ్యాఖ్యానిస్తూ, ఆయన రుణం తీర్చుకోవద్దా అంటూ ప్రశ్నించారు. సోనియా గాంధీ సర్టిఫికెట్ ఉంటే చాలంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణ

గంగుల సెటైర్లు.. ‘మైనింగ్ అంటే మై ఎర్నింగ్!’

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాత్రలో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కోసం సొంత డబ్బు ఖర్చు చేశానని, ఇప్పుడు సంపాదించుకోవాలని సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. కమిషన్లు, సెటిల్‌మెంట్లు, భూ భారతి, వెలుగుమట్ల అంశాలను ప్రస్తావిస్తూ “మైనింగ్ అంటే మై ఎర్నింగ్ అధ్యక్షా!” అంటూ చేసిన వ్యాఖ్యలు మాక్ అసెంబ్లీలో ఆకట్టుకున్నాయి.

హైదరాబాద్

మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్రలో చమత్కార వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా అనుకరిస్తూ, “హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నాం.. ఏ సంవత్సరం వంద రోజులో చెప్పలేదు కదా!” అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, రైతుల సమస్యలు, ఢిల్లీ నాయకత్వంతో ఇబ్బందులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

హైదరాబాద్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు దారుణం: తలసాని

అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడం దారుణమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 7న అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయని, మహిళా ఎమ్మెల్యేలతోనూ అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్‌కు గౌరవం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

బీఆర్ఎస్ నేతలపై పోలీసుల దౌర్జన్యం దారుణం ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రజలు సహించరు: మాజీ ఎంపీ నామ

ఖమ్మం: అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను బలవంతంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. అరెస్టు సందర్భంగా కేటీఆర్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. పోలీసుల తోపులాటలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, సునీత లక్ష్మారెడ్డికి స్వల్ప గాయాలు కావడం విచారకరమన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావును తోపులాటలో కిందపడేలా చేయడం శోచనీయమన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి పట్ల వ్యవహరించిన తీరు ఇదేనా అని నామ ప్రశ్నించారు. మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఎమ్మెల్యేలనే లాక్కెళ్లడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నేతలపై పోలీసులు బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అరెస్టులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ నిరసనలు చేస్తే ప్రజాస్వామ్యం, తెలంగాణలో బీఆర్ఎస్ నిరసన చేస్తే అరెస్టులా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు నల్లచొక్కాలు ధరించి వెళ్తే తప్పులేదు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. కాంగ్రెస్‌కు కేంద్రంలో ఒక న్యాయం, తెలంగాణలో మరో న్యాయమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గొంతు నొక్కాలని చూస్తే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని నామ నాగేశ్వరరావు హెచ్చరించారు

తెలంగాణ

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. నల్ల టీషర్టులతో సభకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.