संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
जनगांव

రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి–జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోమ్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి–జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోమ్

*రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి*
–జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోమ్*

రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని *జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోమ్* అధికారులను అదేశించారు.

శుక్రవారం, జనగామ డివిజన్ పరిధిలో చేపడుతున్న భూముల రీసర్వే పనుల పురోగతిపై ఆర్డీఓ కార్యాలయంలో *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోమ్* డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్ (రెవెన్యూ)* మాట్లాడుతూ.. మండలాల వారీగా, గ్రామాల వారీగా రీసర్వే పనుల ప్రస్తుత స్థితిగతులు, ఇప్పటివరకు సాధించిన పురోగతిని సమగ్రంగా సమీక్షించారు.

ప్రతి గ్రామంలో రీసర్వే ప్రక్రియ ఏ మేరకు పూర్తయింది, ఇంకా చేపట్టాల్సిన పనులు ఏమిటి అనే అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రీసర్వే పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, సర్వేయర్లు, రీసర్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల వారీగా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

రీసర్వే ప్రక్రియలో ప్రతి గ్రామానికి సంబంధించిన పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ మన్యంకొండ, డివిజన్ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, రీసర్వే బృందాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి–జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోమ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *