संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: Andhra Pradesh

ప్రకాశం

కనిగిరి ప్రజలకు సైబర్ మోసాలపై అలర్ట్.. ఒక్క పొరపాటుతో ఖాతా ఖాళీ!

కనిగిరి: ఆన్‌లైన్ చెల్లింపులు, UPI, మొబైల్ బ్యాంకింగ్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. “KYC పూర్తికాలేదు”, “బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుంది”, “పార్సెల్ వచ్చింది”, “లోన్ మంజూరైంది” అంటూ వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మి వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదు. OTP, ATM PIN, UPI PIN, CVV, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోకండి. తెలియని లింకులను క్లిక్ చేయవద్దు. డబ్బు పంపుతున్నామని చెప్పి UPI PIN నమోదు చేయమంటే అప్రమత్తంగా ఉండాలి. పోలీస్, CBI, ED వంటి అధికారుల పేరుతో వీడియో కాల్ చేసి బెదిరించినా భయపడకండి. డబ్బులు పంపకుండా అధికారిక మార్గంలో విషయాన్ని నిర్ధారించుకోవాలి. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి. అలాగే బ్యాంకును సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. కనిగిరి ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్ మోసాలను చాలా వరకు అడ్డుకోవచ్చు. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీనివాస్ కి ఎంపదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు ✨ మిత్రులు

పెరగనున్న జిడిపి వృద్ధి రేటు-బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి-మార్కాపురం:_గాంధీ జయంతి సందర్భంగా కరవుసీమ రాయలసీమను రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం సంతోషకరమైన విషయమని బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.రాయలసీమలోని కరవు పరిస్థితులు,రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అర్థం చేసుకుని,ప్రాంత సమగ్రాభివృద్ధికి దూరదృష్టితో ముందడుగు వేయడం అభినందనీయమన్నారు.రూ.లక్ష కోట్ల పెట్టుబడితో రాయలసీమ ఉద్యాన హబ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం ద్వారా రాయలసీమ వ్యవసాయ రంగంలో నూతన శకం ప్రారంభమవుతుందని ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.ఉద్యాన పంటలకు అనుకూలమైన రాయలసీమ భౌగోళిక పరిస్థితులను సద్వినియోగం చేసుకుని,ఆధునిక సాంకేతికత,సాగునీటి వసతులు,శీతల గిడ్డంగులు,ప్రాసెసింగ్ యూనిట్లు,మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తే రైతులకు మరింత మెరుగైన ఆదాయ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.ఈ ప్రాజెక్టు ద్వారా రైతుల ఉత్పత్తులకు విలువ ఆధారిత మార్కెట్ కల్పించడంతో పాటు,వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుందని,యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.రాయలసీమను కేవలం కరవు ప్రాంతంగా కాకుండా దేశానికి,ప్రపంచానికి ఉద్యాన ఉత్పత్తులను అందించే వ్యవసాయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ నిర్ణయం కీలకమైన అడుగుగా నిలుస్తుందని ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.రైతుల సంక్షేమం,ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రాయలసీమలో పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకురావాలనే ప్రభుత్వ సంకల్పం సాకారమైతే ఈ ప్రాంత ఆర్థిక,సామాజిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా ఏపీలో ముఖ్యంగా రాయలసీమలో జిడిపి వృద్ధి రేటు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రా రెడ్డి అన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు రూరల్‌లో ₹857 కోట్ల అభివృద్ధి: కోటంరెడ్డి

కూటమి ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.857 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్ పరిధిలోని 36 డివిజన్లకు రూ.109 కోట్లు మంజూరయ్యాయని, వీటితో 625 అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలో నెల్లూరు నగర కార్పొరేషన్‌కు మరో రూ.300 కోట్ల నిధులు తీసుకురావడానికి మంత్రి నారాయణ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆమంచర్లలో పారిశ్రామికవాడకు 500 ఎకరాలు, నరసింహకొండకు కేంద్ర నిధుల సాధనలో కలెక్టర్ హిమాన్షు శుక్లా సహకారం కీలకమన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు.

అమరావతి

డీఎస్సీపై పోరాటం ఆగదు: వైఎస్ జగన్

డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ విచారణ కోరుతూ చేపట్టిన వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలపై జరిగిన ఘటనలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులతో సమావేశమైన జగన్, నిరసన కార్యక్రమాల సందర్భంగా తమ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌పై కూడా జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతున్నందుకే తమ పార్టీ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. బెదిరింపులకు వెనకడుగు వేసేది లేదని, డీఎస్సీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే వరకు పోరాటం కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు. అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దోమల రహిత నెల్లూరే లక్ష్యం: నారాయణ

నగరాన్ని దోమల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలో నిలిచిపోయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను తిరిగి ప్రారంభించామని, 2027 జూన్ 12 నాటికి వాటిని పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 13వ డివిజన్ యలమవారిదిన్నెలో ₹35 లక్షలతో పునర్నిర్మించిన స్వర్ణ వార్డు భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అల్లీపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్

వైఎస్ఆర్ వర్ధంతి రోజునే పోలవరం జలాలు

వైఎస్ఆర్ వర్ధంతి రోజున పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభం కావడం ప్రత్యేక చారిత్రక సందర్భంగా నిలిచింది. పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆయన ప్రభుత్వ కాలంలో ఎడమ, కుడి ప్రధాన కాలువల పనులకు కీలక ముందడుగు పడింది. ఏళ్ల తర్వాత ఆయనను స్మరించుకునే రోజునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎడమ కాలువలో నీటి ప్రవాహం ప్రారంభం కావడం సాగునీటి రంగంలో విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ఆర్ కల, కాలువ, వర్ధంతి ఒకే రోజున కలిసిన చారిత్రక సందర్భమిది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అవ్వాతాతల ఆనందమే మా సంతోషం : మంత్రి నారాయణ

అవ్వాతాతల కళ్లలో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు 6వ డివిజన్ ఉడ్‌హౌస్ సంఘంలో మంగళవారం NTR భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. కూటమి ప్రభుత్వం 62 లక్షల కుటుంబాల పింఛన్ల కోసం ఏటా ₹33 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ఇప్పటివరకు ₹73,594.44 కోట్లు కేటాయించిందని తెలిపారు. వృద్ధులు, వితంతువులకు ₹4,000, దివ్యాంగులకు ₹6,000, పూర్తి వికలాంగులకు ₹15,000, కిడ్నీ, కాలేయ వ్యాధిగ్రస్తులకు ₹10,000 అందిస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ కృషితో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తాళ్లపాక అనూరాధ, విజేతా రెడ్డి, కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, కొండా ప్రవీణ్, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కరువు కాటేస్తుంటే చంద్రబాబు మౌనం: జగన్

రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం వర్షపాతం లోటు ఉందని, 688 మండలాల్లో 625 మండలాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఖరీఫ్ సాగు తగ్గిందని, రైతులకు సాగునీరు, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరువు సహాయక చర్యలు, ప్రత్యామ్నాయ విత్తనాలు, ఉపాధి హామీ పనులపై వెంటనే కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పీజీఆర్ఎస్ కు 214 అర్జీలు

అమలాపురం, పున్నమి దినపత్రిక: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా నిర్ణీత కాల వ్యవధిలోపు పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు అధికారులు ఆదేశించారు. సోమవారం డా.బీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీ ఆర్ఎస్) కార్యక్రమం అమలాపురం కలెక్టరేట్ లోని గోదావరి భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు, కొత్తపేట, రామచంద్రాపురం ఆర్డీవోలు జీవీవీ.సత్యనారాయణ, సరళావతి, ఎస్డీసీ డి.అచ్యుతా కుమారి, డీఆర్డీఏ పీడీ డి.రాంబాబు, స్వర్ణ గ్రామ, వార్డు అధికారి పి. రాజేశ్వరి, డ్వామా పీడీ జీఎస్.రామ్ గోపాల్ తదితరులతో కలిసి జిల్లా చుట్టూ ప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, దరఖాస్తులు స్వీకరించారు. భూ రికార్డు ఆన్ లైన్ లో నమోదు, రీ సర్వే, భూ ఆక్రమణలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పారిశుధ్యం, మురికి కాలువలకు పుడికతీత, ఇంటిస్థలం, ఇళ్లు, పింఛను, సదరం సర్టిఫికెట్, రహదారులు మంజురు వంటి అంశాలపై మొత్తం 214 అర్జీలు అందాయి.ఈ అర్జీలను సంబంధిత అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించాలని డీఆర్వో ఆదేశించారు. ఈ సందర్భంగా డీఆర్వో వి‌.సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే ఉద్దేశంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. వివిధ శాఖలో నమోదైన అర్జీల పట్ల సంబంధిత అధికారులు అధిక ప్రాధాన్యత ఇచ్చి, తప్పనిసరిగా నిర్దిష్ట కాల వ్యవధిలోపు పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారులకు సూచించారు. వివిధ శాఖల్లో నమోదై అర్జీలకు సరైన పరిష్కార నివేదిక సిద్దం చేసి, ఆన్ లైన్ లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని డీఆర్వో అధికారులకు స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదుల కొరకు 1100 టోల్ ఫ్రీ నెంబర్, మీ కోసం ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కూడా నమోదుకు అవకాశం ఉందని, అలాగే మండల, గ్రామ వార్డు స్థాయిలలో అధికారులకు సమర్పించవచ్చునన్నారు . రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సేవలను జిల్లా వాసులు సద్వినియోగ చేసుకోవాలని చేయాలని డీఆర్వో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ లు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బీసీ రిజర్వేషన్ల కృతజ్ఞత సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల

ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన బీసీ రిజర్వేషన్ల కృతజ్ఞత సమావేశంలో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు పాల్గొని, బీసీల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ, బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం కేవలం ఒక నిర్ణయం మాత్రమే కాదని, బీసీల రాజకీయ సాధికారతకు బలమైన పునాది అని అన్నారు. గ్రామస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగి, కొత్త నాయకత్వం తయారవుతుందని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి, సంక్షేమం, రాజకీయ సాధికారతకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తున్నారని, ఇచ్చిన హామీ మేరకు 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరించి బీసీ సమాజానికి న్యాయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, పార్టీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.