Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: సదుం

చిత్తూరు

సదుం అయ్యప్ప సన్నిధిలో మాలధారణల కోలాహలం (స్వామివారి దర్శనానికి, దీక్షలు స్వీకరించేందుకు పోటెత్తిన భక్తులు)

సదుం, అక్టోబర్ 05 (పున్నమి న్యూస్ ప్రతినిధి): సదుం మండల కేంద్రంలో వెలసియున్న శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం భక్తుల నామస్మరణతో మార్మోగింది. అయ్యప్ప దీక్షల కాలం ప్రారంభం కావడంతో మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అయ్యప్ప మాలధారణ చేశారు. గురుస్వాముల పర్యవేక్షణలో భక్తులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తులసి, రుద్రాక్ష మాలలను ధరించి మండల దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అయ్యప్ప స్వామికి విశేష అభిషేకాలు, దీపాలంకరణ, పుష్పాలంకరణలు అత్యంత నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ‘స్వామియే శరణం అయ్యప్ప’ శరణుఘోషలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మాలధారణ చేసుకున్న భక్తులకు, దర్శనార్థం విచ్చేసిన ప్రజలకు తీర్థప్రసాదాలు అందజేశారు. Uploaded Video: