संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: బ్రేకింగ్ news

విజయనగరం 

117 వా వార్డ్ నుంచి జనసేన పార్టీ తరఫున అయితి సింహాచలం నామినేషన్ నేషన్

117వ వార్డు నుంచి జనసేన పార్టీ తరఫున అయితి సింహాచలం నామినేషన్ జిల్లా బ్యూరో రమణ అక్టోబర్ 18 పున్నమి ప్రతినిధి 117వ వార్డు నుంచి జనసేన పార్టీ తరుపున అయితి సింహాచలం నామినేషన్ దాఖలు చేశారు. గతంలో పులగానిపాలెం సర్పంచ్‌గా రెండుసార్లు పనిచేసిన ఆయన, కోఆపరేటివ్ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రజా సేవలో అనుభవం కలిగిన సింహాచలం ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఎన్నికల కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో గ్రామస్థాయి నుంచి వివిధ బాధ్యతలు నిర్వహించిన ఆయన, ప్రస్తుతం 117వ వార్డులో జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

తిరుపతి

సెప్టెంబర్‌ 1న చలో దిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: సీపీఐ

చిట్వేల్ మండలంలో సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ సెప్టెంబర్‌ 1న దిల్లీలో చేపట్టనున్న చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి, తహసీల్దార్‌ నరసింహారావుకు వినతిపత్రం అందజేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, మతోన్మాదంపై కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.