Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: కొత్తగూడెం

BHADRADRI

శారదా కుటీర్ లో అర్ధనారిశ్వర స్వామి దేవాలయం ప్రారంభోత్సవం……

కొత్తగూడెం జిల్లా :అక్టోంబర్ 17:(పున్నమి ప్రతినిధి )… కొత్తగూడెం పట్టణం బస్టాండ్ ఎదురుగ వున్నా శారదా కుటీర్ రంగారావు గారి ఆధ్వర్యంలో అర్ధానరీశ్వర స్వామి దేవాలయంప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఆలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హైద్రాబాద్ నుండి వచ్చిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ శ్రీ శ్రీ శ్రీరామ్ సార్ గారు విచ్చేసి స్వామి వారికీ మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి పట్టణ ప్రముఖులు మరియు భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ లేబర్ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సబ్బని రాజేష్ కుమార్, శ్రీ రామ్ మెస్ ఓనర్ JV , రవి ఎలక్ట్రానిక్స్ రాజేంద్ర ప్రసాద్,spiritual క్లబ్స member సత్యనారాయణ, సంతోష్ రాజ, సురేష్, రామ్ లక్ష్మణ్ , తదితరులు పాల్గొన్నారు….

BHADRADRI

లేబర్ సెల్ ఆధ్వర్యంలో one టౌన్ CI కి సన్మానం

కొత్తగూడెం జిల్లా :అక్టోంబర్ 13:(పున్నమి ప్రతినిధి ).. ఈ రోజు one town CI గ కొత్తగూడెం లో బాధ్యతలు స్వీకరించిన కారణంగా జితేందర్ గారికి భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ లేబర్ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్ములాపురం సత్యనారాయణ మరియు జనరల్ సెక్రెటరీ సబ్బానీ రాజేష్ కుమార్ బీజేపీ జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్,ఐక్య తల్లితండ్రుల సంగం ఉపాధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు,ప్రముఖ యోగ మాస్టర్ రాజమౌళి తదితరులు CI గారిని ఘనంగా సన్మానించారు

BHADRADRI

శివాజీ మహారాజ్ సేవ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి శాస్త్ర చికత్స

కొత్తగూడెం జిల్లా :అక్టోబర్ 12:(పున్నమి ప్రతినిధి ).. ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవాసంఘం ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో శంకర కంటి హాస్పిటల్ వారి సహకారంతో పేద ప్రజలకి ఉచిత కంటి వైద్య సేవలు మరియి కంటికి శాస్త్ర చికిత్సలు అందించేందుకు సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అక్టోంబర్ నెలలో కొత్తగూడెం జిల్లా నుండి 149 మంది సభ్యులని కంటి ఆపరేషన్ కోసం పంపించటం జరిగిందని సంఘం ప్రతినిధులు తెలిపారు.కంటి సమస్యతో బాధపడేవారికి మెరుగైన వైద్యం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపాలన్నదే సంఘం లక్ష్యం అని తెలిపారు.ఈ సేవ కార్యక్రమంలో శివాజీ సేవ సంఘం స్థాపకులు సుంకు కనకరాజు,సహా వ్యవస్థాపకులు గునుగంటి చంద్ర, నమ్మి జగదీశ్ మరియు తదితరులు పాల్గొని కార్యక్రమ విజయానికి తగు సహకారం అందించారు.

BHADRADRI

బిజెపి యువమోర్చ ఆధ్వర్యంలో సీఎం దిష్టి బొమ్మ దగ్ధం )…

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 29:(పున్నమి ప్రతినిధి ): హిందూ దేవుళ్ళని అవమానిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినేవిధంగా అవమానకరంగా మాట్లాడిన సీఎం రేవంత్ వ్యాఖ్యలని నిరసిస్తూ బిజెపి పిలుపు మేరకు యువమోర్చ ఆధ్వర్యంలో ఇల్లందులో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చెయ్యటం జరిగింది.ఈ సందర్బంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకోసం హిందూ దేవులని అవమానించటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.కోట్లాదిమంది హిందువులు కొలిచే దేవుళ్ళకి కూడా కులం మతం పేదోడు ఉన్నోడు అని విడదీసిమాట్లాడటం రేవంత్ నీచ మనస్తాత్వనికి నిదర్శనం అని తెలిపారు,హిందూ దేవుళ్ళని దూశిస్తే బిజెపి పార్ట్ చూస్తూ ఊరుకోదని సీఎం వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారులేని ఎడలా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలని కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు…

BHADRADRI

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 24:(పున్నమి ప్రతినిధి ): ఈ రోజు కొత్తగూడెం జిల్లాపాల్వంచ పెద్దమ్మతల్లి గుడి దగ్గరలోని ఫంక్షన్ హాల్ లొ mla సమక్షంలో జరిగిన ఇందిరమ్మ ఇల్లు పంపకాలు విషయంలో BC కేటగిరీ కి తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు mla ని నీలాదీశారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులతో అన్నివర్గాలకి ఇళ్లు కేటాయించాలని ఒకవర్గనికేయివ్వటం అన్యాయమని నీలాదీశారు. బీసీలకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని తేల్చి చెప్పారు..

BHADRADRI

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు )…

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 17:(పున్నమి ప్రతినిధి ): కొత్తగూడెం కేంద్రం లొ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జాతీయజెండా ఎగరావేయటం జరిగింది.సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్బంగా స్థానిక రైల్వేస్టేషన్ నందు ఆశీర్వాద దీపం వెలిగించటం జరిగింది.ఈ కార్యక్రమం లొ బీజేపీ కార్మిక సెల్ కో కన్వినర్ సబ్బానీ రాజేష్ గారు, మరియు వివిధ మోర్చాలా నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రధానికి ఆశీర్వాదం తెలిపారు..

BHADRADRI

బీజేపీ ఆధ్వర్యంలో లేబర్ సెల్ విభాగం సమావేశం )

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 15:(పున్నమి ప్రతినిధి ) ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో భారతీయ కార్మిక సెల్ విభాగం అయ్యిన బీజేపీ మజ్ దూర్ మోర్చకార్యకర్తల సమావేశం జిల్లా బీజేపీ కార్యాలయం లొ జరిగింది.ఈ సమావేశానికి కార్మిక సెల్ విభాగం జిల్లా కో కన్వీనర్ సబ్బానీ రాజేష్ గారు అధ్యక్షాత వహించారు.రాజేష్ గారు మాట్లాడుతూ న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (NEHS)మార్గదర్శకాల ముఖ్యంశాల గురించి వివరించారు.నెహస్ మార్గదర్శకాలు 17జులై 2026నుండి అమలులోకి వచ్చాయని తెలిపారు.వక్కో చికిత్స ఎపిసోడ్ కి 3లక్షల వరకు కవరేజ్ ఉంటది.చికిత్స 3లక్షలు దాటినా కవరేజ్ వర్తిస్తుంది కాబట్టి అందరు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.3నుండి 10లక్షల వరకు ఫ్రీ క్లెయిమ్ ని ప్రత్యేక శుభాకాంక్షలు సబ్ కమిటీ పరిశీలిస్తుంది అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,సర్వీస్ పెన్షనర్లు,ఫ్యామిలీ పెన్షనర్లు అర్హులుగా వుంటారు.దీనిని అర్హత గల వారు అందరు ఉపయోగించుకోవాలని తెలిపారు

BHADRADRI

కొత్తగూడెం లొ బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం ))

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 12:(పున్నమి ప్రతినిధి ):యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) కేంద్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కొత్తగూడెం పరిధిలో బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన ఒక రోజు ఉమ్మడి సమ్మె విజయవంతమైంది. వారానికి ఐదు రోజుల పనిదినాల ప్రతిపాదనను ఆమోదించాలని, ఉద్యోగులకు న్యాయమైన పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌బీఐ ఆర్‌బీఓ కార్యాలయం నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏజీఎస్ కె. శ్రీకాంత్, రీజినల్ సెక్రటరీ కె. అర్జున్, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు అరుణ్ కుమార్, శ్రీకాంత్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రతినిధులు కె. నిశ్చల్, విద్యాసాగర్, ఎస్‌బీఐ అవార్డు స్టాఫ్ లీడర్ భవానీ శంకర్, డీసీసీబీ లీడర్ వెంకట కృష్ణ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం, ఐబీఏ తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె, అప్పటికీ స్పందించకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.

BHADRADRI

వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి ))

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 10:(పున్నమి ప్రతినిధి ): కొత్తగూడెం లోనిగణేష్యా టెంపుల ఎదురుగ వున్నా యామిని మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ లొ చిన్నారి మృతి కలకలం లేపింది. మంగళవారం రాత్రి ఆరు నెలల బాబు కి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా ఉంటే హుటాహుటిన కొత్తగూడెం లోని యామిని హాస్పిటల్ కి తీసుకువచ్చారు.అక్కడ చికిత్స పొందుతూ బాబు చనిపోయాడు.చిన్నారి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అని తల్లితండ్రులు బంధువులు ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళనకి దిగారు.ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు శ్వాస లొ ఇబ్బందిగా ఉండటంతో వెంటిలేటర్ మీద పెట్టాలని ఫీజు తీసయకున్నారు.ఆ తరువాత వైద్యం చేయగా బుధవారం తెల్లవారుజామున స్కానింగ్ బ్లడ్ రిపోర్ట్ పేరుతో 70వేల రూపాయలవరకు వసూలు చేసి కొద్దిసేపటి తరువాత బాబు చనిపోయాడని వైద్యులు చెప్పటంతో వాళ్ళు అవక్కాయ్యారు.వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన బాబు చనిపోయాడని ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు., విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని తల్లితండ్రులకి ధైర్యం చెప్పారు, చిన్నారి మృతికి కారణం అయ్యిన హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పటం తో ఆందోళన విరమించారు…

BHADRADRI

బీజేపీ మజ్దూర్ మోర్చా కార్మిక విభాగం కార్యకర్తలు సమూహం )

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 7:(పున్నమి ప్రతినిధి ):: కొత్తగూడెం పట్టణం లొ బీజేపీ పార్టీ కార్యాలయం లొ ఆదివారం నాడు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న భారతీయ కార్మిక సెల్ విభాగం మజ్దూర్ మోర్చా విభాగం కార్యకర్తలు సమావేశం జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్మిక విభాగం సెల్ కో కన్వినర్ రాజేష్ గారి అధ్యక్షతన నిర్వహించటం జరిగింది.ఈ సమావేశం లొ రాజేష్ గారు మాట్లాడుతూ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రభుత్వ ఉద్యోగులు తప్ప అందరు అర్హులే అని తెలిపారు, ఇన్సూరెన్స్ కి తెల్ల రేషన్ కార్డు తప్పని సరిగా అవసరం.ఏడాదికి 22rs కట్టాలి, 5ఇయర్స్ కి కలిపి 110rs కట్టాలి.ఇన్సూరెన్స్ కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు మరియు ప్రమాదంలో మరణించినప్పుడు ఉపయోగపడుతుంది . దీనికి 18నుండి 55ఇయర్స్ వున్నా స్త్రీ పురుషులందరు అర్హులు. ఇది చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు బ్యాంకు చలానా జతచేసి లేబర్ ఆఫీస్ లొ ఇవ్వాలని సూచించారు.కావలసిన వాళ్ళు 6304438161నెంబర్ కి సంప్రదించాలని కోరారు..