నెల్లూరు జిల్లా, నవంబర్ (పున్నమి ప్రతినిధి)
నూతనంగా ఈరోజు CMO (సెక్టరల్ ఆఫీసర్) గా SSA – SPS Nellore District Project Office నందు బాధ్యతలు స్వీకరించిన శ్రీ జి. రమణయ్య గారికి విద్యాశాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యారంగంలో విశేష అనుభవం, నిర్వాహణ నైపుణ్యంతో రమణయ్య గారు విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ ముందంజలో ఉన్నారు.
ఈ సందర్భంలో బ్లడ్ బ్యాంక్ & రెడ్ క్రాస్ ఇన్‌చార్జ్ శ్రీ అజయ్ బాబు గారు శ్రీ రమణయ్య గారిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పలువురు విద్యాధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని అభినందనలు తెలియజేశారు.


