న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR 2025) తేదీలను ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) రేపు సోమవారం సాయంత్రం 4:15 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఈ సమావేశంలో పాల్గొంటారు. మొదటి దశలో 10 నుంచి 15 రాష్ట్రాలు కవర్ కానున్నాయి. ముఖ్యంగా 2026 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు ఈ దశలో ఉన్నాయి. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, బదిలీలు వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. ఓటర్ జాబితా లోపాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో, ఈ సర్వేకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా BLOల ద్వారా సర్వేలు, ఫోటో ID అప్‌డేట్స్ జరగనున్నాయి.

SIR 2025: రేపు దేశవ్యాప్తంగా SIR ప్రత్యేక సర్వేపై ఈసీ ప్రెస్‌మీట్ – కీలక ప్రకటనలు