విజయవాడ లబ్బీపేట న్యూస్…. పున్నమి….. డాక్టర్ మంజుల గుదిమెళ్ళ……….
10. 12 .2025 వ తేదీన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, గోల్డెన్ జూబ్లీ
(1975- 2025) వేడుకల సందర్భంగా *భౌతిక శాస్త్ర విభాగం *వారు జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ .VVS కుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు నెల్లూరు , విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్
ప్రొఫెసర్ అల్లం శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరు *NEED OF TRUE LEADERS IN CONTEMPORARY SOCIETY*….. అనే అంశంపై ప్రసంగించారు.
సమకాలీన సమాజానికి అవసరమైన నాయకత్వ లక్షణాలను వివరిస్తూ ,నాయకత్వం అంటే అధికారమే కాదు ,బాధ్యతతో కూడిన సేవా భావం అని స్పష్టం చేశారు . అలాగే ఎలక్ట్రానిక్స్ ,క్వాంటం టెక్నాలజీ వంటి శాస్త్రీయ అంశాలను విద్యార్థులకు వివరించారు . అది కాక అబ్రహం లింకన్ యొక్క విలువ ఆధారిత నాయకత్వాన్ని ,హిట్లర్ యొక్క దుర్వినియోగ నాయకత్వాన్ని ఉదాహరణగా తీసుకుని సమాజానికి కావలసిన నాయకత్వ లక్షణాలను వివరిస్తూ విలువైన సందేశం అందించారు . ఆ తర్వాత వారు ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతూ విద్య మనిషిని శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్న ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీవీఎస్ కుమార్ గారు…
భౌతిక శాస్త్ర విభాగాధిపతి శ్రీమతి ఎమ్ గీతామాధురి , సభ్యులు S.N .సునీత D. నీరజ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు .


