ఖమ్మం సెప్టెంబర్
పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్)
తల్లాడ
ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలో గల అన్నారుగూడెం గ్రామం ఎస్సీ కాలనీ సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులు ముందడుగు వేశారు.
అన్నారుగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీ గత కొన్నేళ్లుగా చిన్నపాటి వర్షం పడినా నీటమునిగిపోవడం, కాలనీ గృహాలలో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్నారుగూడెం గ్రామానికి చెందిన భాజపా ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు ఆపతి వెంకట రామారావు ఆధ్వర్యంలో కాలనీవాసులు పలుమార్లు జిల్లా కలెక్టర్ ని కలసి వినతిపత్రాలు అందించారు.
కలెక్టర్ సానుకూలంగా స్పందించడంతో, గురువారం నాడు జిల్లా పంచాయతీ రాజ్ అధికారి ఆశాలత స్వయంగా అన్నారుగూడెం ఎస్సీ కాలనీని సందర్శించారు. కాలనీవాసులు, గ్రామ పెద్దలు తమ సమస్యలను నేరుగా వివరించారు.
ఈ సందర్భంగా డిపిఓ కీలక సూచనలు చేశారు:
• గ్రామంలోని ఎన్ఎస్పీ కాలువకు ఇరువైపులా సరిహద్దులు గుర్తించాలి
• కాలువ మొత్తానికి ఇరువైపులా సిమెంట్ లైనింగ్ కోసం అంచనా (Estimate) సిద్ధం చేయాలి
• కాలువలకు ఇరుప్రక్కలా మురుగునీరు వెళ్ళే డ్రైనేజ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి
• కాలనీలో కూడా శాశ్వత డ్రైనేజ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి
ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ గారితో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో తల్లాడ మండల ఎంపీడీవో సురేష్ ఎన్ఎస్పిఏఈ ఆయేషా మండల అధికారులు, గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు, రమేష్, గ్రామ ప్రముఖులు తుమ్మలపల్లి రమేష్, ఎల్లంకి సుధాకర్, ఇసనపల్లి కృష్ణార్జున్, భవాని, గొడ్ల సాల్మన్,గొడ్ల నరేష్, ఇసనుపల్లి బాబు, ఇసనపల్లి పేతురు ఎస్సీ కాలనీవాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు


