సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)
SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు నవంబర్ 1, 2025 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. CRED, Cheq, MobiKwik వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా బిల్లులు చెల్లిస్తే 1% ఫీజు విధించబడుతుంది. అలాగే, వాలెట్లో రూ.1,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసినా ఈ ఫీజు వర్తిస్తుంది. అయితే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు నేరుగా చెల్లింపులపై మాత్రం మినహాయింపు ఇవ్వనున్నారు. నగదు చెల్లింపులు, చెక్ ద్వారా బకాయిలు తీర్చడం, కార్డు మార్పులు వంటి సేవలపై కూడా అదనపు ఫీజులు విధించనున్నారు. వినియోగదారులు ఈ మార్పులను గమనించి తమ చెల్లింపులను తగిన రీతిలో ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది.


