తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ మండలం, ధవళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) బుధవారం ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనం కళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, యువతలో సృజనాత్మకతను, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఇటువంటి హబ్ లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఈ హబ్ ద్వారా అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, ఇది స్థానిక యువతకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ హబ్ లోని అత్యాధునిక సౌకర్యాలు, శిక్షణా కార్యక్రమాలు యువ పారిశ్రామికవేత్తలను, స్టార్టప్ లను ప్రోత్సహించి, ప్రాంతాభివృద్ధికి దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


