PMDDYK యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి
–జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
———————————————-
జనగామ, అక్టోబర్21,పున్నమి న్యూస్:
వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచి… స్థిరమైన పద్ధతులను ప్రోత్సహిస్తూ.. గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడానికి రూపొందించిన సమగ్ర వ్యవసాయ కార్యక్రమయిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకానికి దేశ వ్యాప్తంగా ఎంపిక అయిన 100 జిల్లా లో జనగాం ఒకటి .
ఈ నేపథ్యంలో PMDDYK కార్యక్రమ అమలు కై వివిధ శాఖల ద్వారా చేపట్టాల్సిన కార్యాచరణ పైన మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో *కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్* సమీక్షించారు. ఈ సందర్భంగా *కలెక్టర్* ముందుగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నమూనా ప్రకారం శాఖల వారీగా…వివిధ పథకాల వారీగా ఏ ఏ అంశాల లో కార్యాచరణ రూపొందించవచ్చో తెలియజేశారు.
అనంతరం మాట్లాడుతూ… జిల్లా అభివృద్ధి కోసం వివిధ శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో క్షేత్ర స్థాయి లో పరిశీలించి… కార్యాచరణను త్వరగా రూపొందించాలన్నారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలే కాకుండా NGO ల ద్వారా, పబ్లిక్, ప్రయివేట్, పార్ట్నర్షిప్ ద్వారా అమలు అయ్యే కార్యక్రమాలను కూడా సూచించ వచ్చాన్నారు.
ఈ సమావేశం లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, సిపిఓ, డిసిఓ, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఏవో కలెక్టరేట్, LDM, తదితరులు పాల్గొన్నారు

PMDDYK యాక్షన్ ప్లాన్ సిధ్ధం చేయండి: జనగామ కలెక్టర్
PMDDYK యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి –జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ———————————————- జనగామ, అక్టోబర్21,పున్నమి న్యూస్: వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచి… స్థిరమైన పద్ధతులను ప్రోత్సహిస్తూ.. గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడానికి రూపొందించిన సమగ్ర వ్యవసాయ కార్యక్రమయిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకానికి దేశ వ్యాప్తంగా ఎంపిక అయిన 100 జిల్లా లో జనగాం ఒకటి . ఈ నేపథ్యంలో PMDDYK కార్యక్రమ అమలు కై వివిధ శాఖల ద్వారా చేపట్టాల్సిన కార్యాచరణ పైన మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో *కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్* సమీక్షించారు. ఈ సందర్భంగా *కలెక్టర్* ముందుగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నమూనా ప్రకారం శాఖల వారీగా…వివిధ పథకాల వారీగా ఏ ఏ అంశాల లో కార్యాచరణ రూపొందించవచ్చో తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ… జిల్లా అభివృద్ధి కోసం వివిధ శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో క్షేత్ర స్థాయి లో పరిశీలించి… కార్యాచరణను త్వరగా రూపొందించాలన్నారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలే కాకుండా NGO ల ద్వారా, పబ్లిక్, ప్రయివేట్, పార్ట్నర్షిప్ ద్వారా అమలు అయ్యే కార్యక్రమాలను కూడా సూచించ వచ్చాన్నారు. ఈ సమావేశం లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, సిపిఓ, డిసిఓ, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఏవో కలెక్టరేట్, LDM, తదితరులు పాల్గొన్నారు

