నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి):
సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించి నిరుపేద కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P-4 ప్రోగ్రాం నిర్వహిస్తోందని కలెక్టర్ ఆనంద్ అన్నారు. P-4 ఉద్దేశాన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులందరికీ వివరించాలనే లక్ష్యంతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వ లక్ష్యంతో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు


