Story highlights
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 19(పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 21 నుంచి 23 వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా మండలాల MPDO కార్యాలయాల్లో…
- అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన, 25న అప్పీళ్లకు అవకాశం, 26న తుది నిర్ణయం, 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.
- నవంబర్ 3న పోలింగ్, 4న అవసరమైన చోట రీపోలింగ్, 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, విజేతలకు ధ్రువీకరణ పత్రాల పంపిణీ చేపట్టనున్నారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 19(పున్నమి ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 21 నుంచి 23 వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా మండలాల MPDO కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన, 25న అప్పీళ్లకు అవకాశం, 26న తుది నిర్ణయం, 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్, 4న అవసరమైన చోట రీపోలింగ్, 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, విజేతలకు ధ్రువీకరణ పత్రాల పంపిణీ చేపట్టనున్నారు.