గుంటూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరమైన, పోటాపోటీగా ఎత్తులు,వ్యూహాలు తో పయనిస్తుండగా…వైసీపీ జిల్లాలో తనదైన ముద్ర పడాలని ప్రణాళికలు రచిస్తుంది .మొన్న జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 2 స్థానాల్లో గుంటూరు పశ్చిమ నియోజక వర్గం,రేపల్లె నుంచి మద్దాలిగిరిధర్,అనగాని సత్యప్రసాద్ లతో టిడిపి సరి పెట్టు కోగా…మూడు పార్లమెంట్ స్థానాల్లో 2 స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకొని తిరుగులేని ఆధిక్యత సాధించింది.రాష్ట్ర ముఖ్యమంత్రి గా వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జిల్లాలో వైసిపిని తిరుగులేని శక్తి గా తయారు చేయాలని పావులు కదుపుతున్నారు.ప్రభుత్వం ఏర్పడిన తరువాత…4 నెలలు పైగా పాలనలో కొన్ని ఇబ్బందులు,గత ప్రభుత్వ అవినీతి జరిగిందని దానిని బయట పెట్టాలని కాలయాపన చేసే బదులు పాలన పై దృష్టి పెట్టి కొనసాగించాలని అలా కాకుండా అన్ని చోట్లా అవినీతిపై యుద్ధం చేయడం వలన పాలన గాడి తప్పుతున్నదని ప్రభుత్వం ముందున్న లక్ష్యాలను అధిక మించేందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలని కొంతమంది రాజకీయ పండితులు భావిస్తున్నారు.కానీ వచ్చిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి…తనదైన శైలిలో ఇచ్చిన హామీలు,నవరత్నాలు ను అందరకు అందించేలా ప్రణాళికా బద్దంగా దూసుకు పోతున్నారు.గుంటూరు జిల్లాకు రాష్ట్ర హోమ్ శాఖా మంత్రిణీ గా శ్రీమతి మేకతోటి సుచరితను,బిసి శాఖా మంత్రిగా మోపిదేవి వెంకట రమణారావు ను,డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి లకు మంత్రి వర్గంలో కేటాయించి జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.మొదటి నుంచి గుంటూరు జిల్లా తెలుగు దేశం నకు మంచి పట్టు ఉండటంతో…ఈసారి ఎలాగైనా తెలుగుదేశం ను ఓడించాలని మొదట నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంది.2014 ఎన్నికల్లో 14 సీట్లు సాధించిన టిడిపి మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో 2 స్థానాలకే చతికిల పడింది.తెలుగుదేశం అధికారము లో ఉన్నపుడు 4 సంవత్సరం లో బిజెపి తో చేతులు కలిపి సహా జీవనం సాగించి,చివర్లో ప్రజల నుంచి ప్రత్యేక హోదా విషయంలో వ్యతిరేకత రావటంతో తెగ దెంపులు చేసుకొని ఒంటరిగా పోటీ చేసింది. రాష్టవ్య్రాప్తంగా తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత ను పసి గట్టలేకపోయింది.జిల్లాలో తెలుగు దేశం లో సీనియర్లు ఉన్నా కాని…అనేక స్థానాల్లో శాసన సభ్యుల పని తీరు,సంక్షేమ పథకాల అమలులో పారదర్శక లేకపోవటం,ఒకే సామాజిక వర్గం పెత్తనం చెలవించటం టిడిపి నాయకులు ఇసుక మాఫియా లాగా ఏర్పడి ఆ శ్రేణులు ఎక్కువ ఆదాయ వనరులు పొందారని వీటివల్ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడకట్టుకున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అనేక మంది సీనియర్లు మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు,మాజీ స్పీకర్ స్వర్గీయ డా: కోడెల ఇంకా యరపతినేని శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుడు జి వి ఆంజనేయులు డొక్కా మాణిక్య వర ప్రసాద్ లాంటి అనుభవం గల నాయకులు ఉన్నప్పటికి జిల్లాలో ఓట్ బ్యాంక్ ను తమ వైపు సాధించు కోవడంలో విఫలం అయ్యారు.
మొత్తం 17 నియోజక వర్గాల్లో..పని తీరు పరిశీలించితే… మంగళగిరి నియోజకవర్గములో మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ ఓటమిని తెలుగు దేశం శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు.అక్కడ వైసీపీ అభ్యర్థి బలమైన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణరెడ్డి నియోజకవర్గము లో ప్రజల్లో ఉండి పాగా వేయ్యటం, ప్రతిపక్షము లో ఉన్నపుడు నిత్యం ప్రజల్లో ఉండటం వలన బలమైన ప్రత్యర్థి అయిన నారా లోకేష్ ను తేలిగ్గా ఓడించగలిగారు.ప్రధానంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయటం అక్కడ ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన ను వారు తిప్పు కోవటంలో విజయవంతం అయ్యారు.జిల్లా వ్యాప్తంగా శాసన సభ్యులుగా విజయ కేతనం ఎగురవేసిన ఎమ్మెల్యే లు తమ నియోజక వర్గం లో నిర్మాణాత్మమైన పాత్ర పోషించి ప్రజలకు వెన్ను దన్నుగా ఉండాలని,ప్రధానం గా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను,నవరత్నాలు ను అమలు చేసే పనుల్లో బిజీ బిజీ గా ఉన్నారు.


