
శ్రీకాకుళం, ఆగస్టు 18:జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సోమవారం (ఆగస్టు 18) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఒక రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ నిర్ణయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.అలాగే, భారీ వర్షాల కారణంగా ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు

