*”మంచి రోడ్లు – మెరుగైన భవిష్యత్‌కు బాటలు”*
ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి
పున్నమి న్యూస్ ప్రతినిధి
10 ఏప్రిల్ 2026
తెలంగాణ ఇంచార్జ్
రంగారెడ్డి జిల్లా
*GHMC పరిధిలోని 52వ డివిజన్ పెద్ద అంబర్ పేటలో నూతన రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన..*
*R&B నుండి 13 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం…*
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో అభివృద్ధి పరుగులు పెడుతుంది..R&B శాఖ నుండి ₹13 కోట్ల భారీ నిధులతో పెద్ద అంబర్ పేటలో నూతన రోడ్ల నిర్మాణ పనులకు నేడు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే *శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి* గారు , RDC చైర్మన్ *శ్రీ మల్ రెడ్డి రామ్ రెడ్డి* శంకుస్థాపన చేయడం జరిగింది. పెద్ద అంబర్ పేటలో ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో చేపట్టిన ఈ పనులు నియోజకవర్గ ప్రగతికి మరో బలమైన నిదర్శనం గా నిలుస్తుంది.
ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు గా మన రంగన్న గెలుపు తరువాత నియోజకవర్గం లొ చాలా గ్రామాలలొ , కాలనీలకు రోడ్లు, అండర్ డ్రైనేజీ వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.. 15 సంవత్సరాలలో నియోజకవర్గం లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది మన రంగన్న రాకతో నేడు ప్రతీ గ్రామం, పట్టణం అభివృద్ధి చెదుతున్నాయి..









