🔸కిడ్నీ వ్యాధితో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేయూత..!
వింజమూరు నవంబర్ 15న
వింజమూరు మండలం, గుండెమడకల గ్రామానికి చెందిన బత్తల వనయ్య కిడ్నీ వ్యాధితో కొద్దిరోజుల క్రితం మృతి చెందడంతో, వారి కుటుంబానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అండగా నిలిచారు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు గుండెమడకల తెలుగుదేశం పార్టీగ్రామ కమిటీ అధ్యక్షులు గాలి రామ్మోహన్ నాయుడు, ప్రముఖ బిల్డర్ గాలి రఘురామ నాయుడుతో కలిసి శుక్రవారం వనయ్య నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అందించిన 5000 రూపాయలను, రామ్మోహన్ నాయుడు 5000 రూపాయలను, రఘురామ నాయుడు 5000 రూపాయలను కలిపి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంగా ₹15,000 అందజేశారు.
ఈ సందర్భంగా, తమకు కష్టకాలంలో అండగా నిలబడి, ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి, గాలి రామ్మోహన్ నాయుడుకి, గాలి రఘురాం నాయుడుకు వనయ్య కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

