“పరిమళభరితమైన, అందమైన పుష్పం”
మొంథా తుఫాన్ అనే పేరు వెనుక ప్రత్యేక అర్థం ఉంది. ‘మొంథా’ అనే పదం “థాయిలాండ్”లో ఆవిర్భవించింది. ఆ భాషలో ‘మొంథా’ అంటే “పరిమళభరితమైన, అందమైన పుష్పం” అని అర్థం. ప్రతి తుఫానుకు ఒక దేశం సూచించిన పేర్లలోంచి వరుసగా పేరు నిర్ణయించబడుతుంది. ఆ క్రమంలో ఈ తుఫాన్‌కు ‘మొంథా’ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీర దిశగా దూసుకువస్తూ తీవ్ర ప్రభావం చూపనుంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.


