Monday, 23 March 2026
  • Home  
  • _బాలయ్యవి అహంకారపూరిత వ్యాఖ్యలు_*
- E-పేపర్

_బాలయ్యవి అహంకారపూరిత వ్యాఖ్యలు_*

పున్నమి ప్రతినిధి కొండపల్లి, సెప్టెంబర్ 26: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణవి అహంకారపూరిత వ్యాఖ్యలు అని కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాసు మండిపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సైకో అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ ఇంటిలో జరిగిన సంఘటనలో అతనికి చేసిన సాయం మరచిపోయి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఎన్టీఆర్ కుమారుడు కాకపోయి ఉంటే బాలకృష్ణకు గుర్తింపు ఉండేది కాదన్నారు. స్త్రీ జాతిని కించపరిచే విధంగా, అవమానకరంగా మాట్లాడిన బాలకృష్ణ హిందూపురానికి ఎమ్మెల్యే కావడం దురదృష్టకరమన్నారు. అఖండ సినిమా టికెట్ల పెంపు విషయంలో జగన్ ద్వారా పొందిన మేలు మర్చిపోయావా? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

పున్నమి ప్రతినిధి
కొండపల్లి, సెప్టెంబర్ 26: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణవి అహంకారపూరిత వ్యాఖ్యలు అని కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాసు మండిపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సైకో అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ ఇంటిలో జరిగిన సంఘటనలో అతనికి చేసిన సాయం మరచిపోయి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఎన్టీఆర్ కుమారుడు కాకపోయి ఉంటే బాలకృష్ణకు గుర్తింపు ఉండేది కాదన్నారు. స్త్రీ జాతిని కించపరిచే విధంగా, అవమానకరంగా మాట్లాడిన బాలకృష్ణ హిందూపురానికి ఎమ్మెల్యే కావడం దురదృష్టకరమన్నారు. అఖండ సినిమా టికెట్ల పెంపు విషయంలో జగన్ ద్వారా పొందిన మేలు మర్చిపోయావా? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.