_*టపాసుల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం: పొదలకూరు ఎస్సై మహ్మద్ హనీఫ్*_
పొదలకూరు : ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు అక్రమంగా నిల్వ ఉంచినా, విక్రయించినా వారిపై పేలుడు పదార్థాల చట్టం, ఐపిసి సెక్షన్స్ ప్రకారం చర్యలు తప్పవని పొదలకూరు ఎస్
ఐ ఎస్.కె. ఎం.డీ హనీఫ్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక పోలీసు స్టేషను లోజరిగిన విలేఖరుల సమావేశంలో ఎస్.ఐ మాట్లాడుతూ దీపావళి పండుగను పురస్కరించుకొనిబాణసంచాను అనుమతి లేకుండా నిల్వ ఉంచిన, తయారుచేసిన, విక్రయాలు జరిపిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. తహసీల్దారు, ఫైర్ ఆఫీసర్, పోలీసు వారు తో కూడిన మండల కమిటీ పరిశీలిస్తారన్నారు.ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పబోవని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా జనావాసాల మధ్యలో గోడాన్స్ ఏర్పాటుచేసి ప్రజా భద్రతను, ఆరోగ్యాన్ని దెబ్బతీసి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. బాణసంచా విక్రయ లైసెన్స్ కలిగిన దుకాణదారులు మాత్రమే వాటిని అమ్మాలి అని, మిగిలినవారెవరైనా విక్రయించినా చట్ట వ్యతిరేకమన్నారు. బాణసంచా విక్రయ, తయారీ లైసెన్స్ కలిగిన దుకాణదారులు ప్రమాదాల నివారణ కోసం పాటించాల్సిన నియమ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలన్నారు.అగ్నిపమాదాలను నిలువరించేందుకు వీలుగా నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పట్టణం లోని హంస రెడ్డి కళ్యాణ మండపం లో తాత్కాలిక టపాసులు అంగడిలు నిర్వహిస్తారన్నారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, పోలీసు వారి నియమ నిబంధనలను ఏమాత్రం మీరిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలకు బాణసంచా అక్రమ నిల్వ విక్రయం నిబంధనలు పాటించకపోవడం వంటి వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీసు వారికి తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.


