Sunday, 22 March 2026
  • Home  
  • _బియ్యం షాపులో పనిచేస్తూ 2025-DSC లో ర్యాంక్ కొట్టి, టీచర్ అయ్యాడు._* *[కంటతడి పెట్టించే రాంబాబు సక్సెస్ స్టోరీ చదివి తీరాల్సిందే…!!!]*
- Blog

_బియ్యం షాపులో పనిచేస్తూ 2025-DSC లో ర్యాంక్ కొట్టి, టీచర్ అయ్యాడు._* *[కంటతడి పెట్టించే రాంబాబు సక్సెస్ స్టోరీ చదివి తీరాల్సిందే…!!!]*

*అతని కుటుంబం మొత్తాన్ని కరోనా పొట్టనపెట్టుకుంది.* *44 ఏళ్లు వచ్చినా ఎవరూ అతనిని పెళ్లిచేసుకోలేదు* *పగబట్టిన పేదరికంతో పోరాటం చేశాడు… అనుకున్నది సాధించాడు.* *తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. పిల్లలను చదివించే స్థోమత లేదు. చందాలు పోగేసుకుని చదువు కన్నాడు. పేదరికం జయించడానికి ఉద్యోగం సాధించాలని నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. ప్రతి డీఎస్సీ పరీక్షల్లోనూ ఏదో ప్రమాదం ముంచుకొచ్చేది. ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది. కరోనా మహమ్మారి వచ్చి తండ్రిని, అక్కను, అన్నయ్యను తీసుకెళ్లి పోయింది. ఒంటరివాడైపోయాడు. నలభై నాలుగేళ్ళు వచ్చినా పిల్లని ఇస్తానన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆశలన్నీ ఆవిరైపోయాయి. బియ్యం షాపులో కూలీగా పని చేసేవాడు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం 2025-డీఎస్సీ ప్రకటించింది. ఇతనికి చివరి అవకాశం మిగిలింది.* *ప్రయత్నించాలా..? మానేయాలా…? అనే మీమాంస. ఏదైతే అయిందని కొద్ది రోజులు పని మానేసి చదువుపై దృష్టి పెట్టాడు. కోచింగ్ సెంటర్ కు వెళ్లే ఆర్థిక స్థోమత లేదు. తెలిసిన వారి దగ్గర పుస్తకాలు తీసుకుని చదువుతూనే ఉన్నాడు. అది ఏ స్థాయిలో అంటే ఇతనిపై పగబట్టిన పేదరికం కూడా జాలిపడేలా చదివాడు. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.* *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన బొమ్మాలి రాంబాబు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువు సాధించారు. అది ఎలాగో పరిశీలిద్దాం…* *ఆయన తల్లిదండ్రులు సంగయ్య, సుజనమ్మలు సుమారు 50 సంవత్సరాల క్రితం బొబ్బిలి నుంచి ఉపాధి కోసం మండపేట వచ్చారు. అయితే మండపేట పట్టణంలో ఇంటి అద్దెలు భరించలేక సమీపంలో ఏడిద గ్రామం చేరుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. సుమారు 40 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇల్లు లేని వారికి కట్టించిన కాలనీ ఇల్లు(పెంకుటిల్లు) ఇచ్చారు. ఇప్పటికీ పెంకులూడిపోయిన ఆ ఇల్లే అతనికి ఆధారం.* *వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అయితే వీరిని చదివించడం సాధ్యం కాదని పెద్దబ్బాయిని బొబ్బిలిలోని వాళ్ళ బంధువులకు ఇచ్చేశారు. ఇద్దరు అబ్బాయిలను కూలి పనులకు తీసుకెళ్లకుండా చదివించడం మొదలుపెట్టారు. అలా పదో తరగతి రాంబాబు, రమేష్ సోదరులు పూర్తి చేశారు. రాంబాబుకు రమేష్ అన్నయ్య కాదు స్నేహితుడు కూడా అని చెప్పాలి. వీరు వలస రావడం వల్ల వీరికి ఇక్కడ బంధువులంటూ ఎవరూ ఉండేవారు కాదు. అలాగే స్నేహితులు కూడా లేకపోవడంతో… అన్నయ్య లోనే స్నేహితులను చూసుకునేవాడు. ఇంటర్మీడియట్ మండపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివేందుకు MPC గ్రూప్ కు దరఖాస్తు చేశారు. అయితే ఆ తండ్రి ఎంపీసీ గ్రూప్ కి ఖర్చు ఎక్కువవుతుంది చదివించలేను, సిఇసి తీసుకోమని చెప్పాడు. అయితే మండపేట కాలేజీలో ఆ సీట్లు పూర్తయి పోయాయి. దీంతో కడియం మండలం మురమండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీఈసీ లో చేరారు. ఏడిద నుండి సైకిల్ పై మురమండ వెళ్ళి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కళాశాలలో BA డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు. అలాగే శ్రీకాకుళంలో ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు.* *అనంతరం రాంబాబు బీ.ఈడీ.కి ఎంట్రన్స్ పరీక్ష రాశారు. మచిలీపట్నం నేషనల్ కళాశాలలో సీటు వచ్చింది. కానీ, చదువుకోవడానికి మాత్రం డబ్బులు లేవు. ఏడిది రథం వీధిలో ఉండే రాజు మాస్టర్ కి ఈ కుర్రాడి పరిస్థితి తెలుసుకుని ప్రోత్సహించారు. బీ.ఈడీ. అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి, కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. అలాగే ఆ పక్క గ్రామం కొత్తపేట ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసే ప్రసాద్ మాస్టారుకు పరిచయం చేశారు. అక్కడ ఆ మాస్టర్ తో పాటు దుళ్ల గ్రామానికి చెందిన కంటిపూడి సత్యనారాయణ మాస్టారులు ఇతనిని దాతల వద్దకు తీసుకెళ్లారు. ప్రసాద్ మాస్టారు తన మోటార్ సైకిల్ పై రాంబాబుని _”అర్తమూరు సత్తి బులిస్వామి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్, ఆలమూరు సమతా స్వచ్ఛంద సేవా సంస్థ, రావులపాలెం రాఘవేంద్ర కంటి ఆసుపత్రికి చెందిన ట్రస్ట్”_ ద్వారా కొంత నిధులను సమకూర్చి బీ.ఈడీ. పూర్తి చేయడానికి కారకులయ్యారు.* *అప్పటి నుంచి టీచర్ అవ్వటానికి రాంబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. 2008 డీఎస్సీలో తొలి ప్రయత్నం లోనే ఎంపికయ్యాడు. సర్టిఫికెట్లు పరిశీలన కూడా పూర్తయింది. నియామక ఉత్తర్వులు రావడమే ఆలస్యం. ఇంతలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో కొందరి ఉద్యోగాలు తారుమారయ్యాయి. అటువంటి దురదృష్టవంతులలో ఈ రాంబాబు ఉండటం చాలా బాధాకరం. ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.* *ఇక 2012లో డీఎస్సీపరీక్షలకు సిద్ధమవుతుండగా తల్లి సుజనమ్మకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో తల్లిని చూసుకోవడంలో ఉండిపోయాడు. చివరకు ఆమె మరణించింది. అటువంటి పరిస్థితుల్లో ఆ పరీక్షల్లో విజయం సాధించలేకపోయారు. అంటే అతన్ని దురదృష్టం ఏవిధంగా వెంటాడుతుందో… చూడండి. 2018 డీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతుండగా తండ్రి సంగయ్యకు జరిగిన ప్రమాదంలో కాలు విరిగిపోయింది. అతని సంరక్షణ చూసుకుంటూ ఆసుపత్రిలోనే ఉండిపోవడం వల్ల ఆ పరీక్షల్లో కూడా గెలవలేకపోయారు.* *ఇతను ఎమ్‌.ఎ, బి.ఈడీ. చదవడం వల్ల పలు కాన్వెంట్లు, ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉండేవారు.* *ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా యావత్తు ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి ఈ కుటుంబాన్ని పొట్టనపెట్టుకుంది. తండ్రి సంగయ్య, అక్క బొత్సా లక్ష్మీ, స్నేహితుడు లాంటి అన్నయ్య రమేష్ లు రెండు వారాల వ్యవధిలోనే రాంబాబు కళ్లముందే మృతి చెందారు. రాంబాబు ఒంటరి వాడైపోయాడు. అతనికి మానసిక ఒత్తిడి ఎక్కువై పోయింది. అలాంటి పరిస్థితుల్లో మరో అక్క రాజాన సుందరమ్మ ఏడిదకు వచ్చి రాంబాబుకు వండి పెడుతున్నది. ఎంత చదువు చదివినా పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి. దుర్బలమైన ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడు తున్నందున వీరిని చూసేవారెవరూ లేకుండా పోయారు. కనీసం జాలి పడేవారు కూడా ‌లేరు‌. ఇతనికి పట్టిన దరిద్రం తమకు ఎక్కడ అంటుకుంటుందో నని దూరం దూరంగా ఉండేవారు.* *ఇలాంటి పరిస్థితుల్లో ఆలమూరు మండలం చెముడులంక హై స్కూల్ పక్కన ఉన్న గుప్తా రైస్ స్టోర్ లో పనికి చేరాడు. ఇతని చదువును చూసి ఆ యాజమాన్యం బరువు పనులు చెప్పకుండా తేలికపాటి పనుల బాధ్యతలు ఇచ్చేవారు. ఎంతో నమ్మకంగా పనిచేయడంతో వారు రాంబాబును పనివాడుగా కాకుండా ఆప్యాయతగా చూసుకునేవారు. సైకిల్ పైనే ఏడిద నుంచి చెముడులంక రోజు వెళ్లి వచ్చేవారు. ఇలాంటి పరిస్థితుల్లో 2025-డీఎస్సీ.ని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో యాజమాన్యం కొంతకాలం పని మానేసి చదువుకోమని సూచించారు. అయితే కోచింగ్ సెంటర్ కు వెళ్లే ఆర్థిక పరిస్థితులు లేకపోవడం వల్ల తెలిసిన వారి వద్ద పుస్తకాలు తీసుకుని రేయింబవళ్ళు చదువుతూనే ఉన్నాడు. అంటే “కసి” అనేదానికి ఇది చివరిదశ అన్నమాట. ఆ స్థాయిలో చదివాడు. అలా చదవడం కూడా ప్రమాదమే కదా..! అదే జరిగింది. ఇంట్లోనే పడిపోతూ ఉండేవాడు. ఇదేంటని ఆసుపత్రికి తీసుకెళ్తే ఇతనికి ఎక్కువగా చదువుతూ ఉండటం వల్ల నిద్రలేక కంటికి రెట్టిగో అనే వ్యాధి సోకింది రెస్ట్ కావాలన్నారు.* *అంతే మళ్ళీ తన పని అయిపోయింది అనుకున్నాడు. అలాగే మందులు వాడుతూ ఆ చదువును కొనసాగిస్తూ వచ్చాడు. ఎక్కడా నిరుత్సాహం అనేదాన్ని తన దరిదాపుల్లోకి రానీయకుండా చూసుకున్నాడు. చివరకి అమలాపురం సమీపంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాయడానికి వెళ్లాడు. పరీక్షా రాస్తూనే మధ్యలో కుప్పకూలి పోయాడు. ఇన్విజిలేటర్లు ఏంటి విషయం అని ఆరా తీశారు. పరిస్థితి వివరించాడు. మందులు వేసుకుని మళ్లీ పరీక్ష రాయడం మొదలు పెట్టాడు. ఆ విధంగా సుమారు 15 నిమిషాలు పరీక్షా సమయం వృధా అయిపోయింది.* *🤔ఈ పరిస్థితుల్లో ఈ పరీక్షలో కూడా గెలవలేననే నిర్ణయానికి వచ్చేశాడు. కానీ, ఫలితాలు చూస్తే✌️ పూర్తిగా రాంబాబు వైపుకు వచ్చేశాయి. ముందుగానే చెప్పాను కదా! ఇతన్ని వెంటాడిన పేదరికం, దారిద్ర్యం వంటివన్నీ జాలిపడ్డాయి. ఇక అతన్ని ఇబ్బంది పెడితే అర్థమే ఉండదనుకున్నాయి. అందుకనే ఒకే పరీక్షలో రెండు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు.😲😃 వాటిల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ (ఎస్సీ కేటగిరీలో 75వ రోస్టర్ పాయింట్) ను 💪ఎంచుకున్నాడు. దీనితో పాటు టిజిటి 138 వ ర్యాంకు సాధించారు.👍* *చూశారా…… రాంబాబు జీవితంలో ఓడిపోయి, పడిపోయి మళ్లీ లేచి ఎలా నిలబడ్డారో….!!!!! యావత్తు ప్రపంచానికి చాటి చెప్పింది ఏంటంటే నిరుత్సాహాన్ని దరి చేరనీయకుండా కష్టపడి చదివితే, లక్ష్యం చేరుకోవచ్చని.💪💪* *రాంబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. అతను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనసారా మా యాజమాన్యం తరుపున కోరుకుంటున్నాం. °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° *_:{ఒక ఫేస్బుక్ పోస్టు ఇది… ఈ సందర్భంగా నేటి యువతీ యువకులకు మా తరుపున ఓ విన్నపం……. ఈ రాంబాబుని స్ఫూర్తిగా తీసుకుని, మొక్కవోని సంకల్పబలంతో.. సాధనచేసి, కష్టాల నుంచి బయటపడి అనుకున్నది సాధించి, ఎత్తులకు ఎదగాలి. అలాగే మరి కొంతమందికి ప్రోత్సాహం కలిగిస్తూ, సాయం చేసే స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములతో… పున్నమి దినపత్రిక

*అతని కుటుంబం మొత్తాన్ని కరోనా పొట్టనపెట్టుకుంది.*

*44 ఏళ్లు వచ్చినా ఎవరూ అతనిని పెళ్లిచేసుకోలేదు*
*పగబట్టిన పేదరికంతో పోరాటం చేశాడు… అనుకున్నది సాధించాడు.*

*తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. పిల్లలను చదివించే స్థోమత లేదు. చందాలు పోగేసుకుని చదువు కన్నాడు. పేదరికం జయించడానికి ఉద్యోగం సాధించాలని నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. ప్రతి డీఎస్సీ పరీక్షల్లోనూ ఏదో ప్రమాదం ముంచుకొచ్చేది. ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది. కరోనా మహమ్మారి వచ్చి తండ్రిని, అక్కను, అన్నయ్యను తీసుకెళ్లి పోయింది. ఒంటరివాడైపోయాడు. నలభై నాలుగేళ్ళు వచ్చినా పిల్లని ఇస్తానన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆశలన్నీ ఆవిరైపోయాయి. బియ్యం షాపులో కూలీగా పని చేసేవాడు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం 2025-డీఎస్సీ ప్రకటించింది. ఇతనికి చివరి అవకాశం మిగిలింది.*

*ప్రయత్నించాలా..? మానేయాలా…? అనే మీమాంస. ఏదైతే అయిందని కొద్ది రోజులు పని మానేసి చదువుపై దృష్టి పెట్టాడు. కోచింగ్ సెంటర్ కు వెళ్లే ఆర్థిక స్థోమత లేదు. తెలిసిన వారి దగ్గర పుస్తకాలు తీసుకుని చదువుతూనే ఉన్నాడు. అది ఏ స్థాయిలో అంటే ఇతనిపై పగబట్టిన పేదరికం కూడా జాలిపడేలా చదివాడు. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.*

*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన బొమ్మాలి రాంబాబు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువు సాధించారు. అది ఎలాగో పరిశీలిద్దాం…*

*ఆయన తల్లిదండ్రులు సంగయ్య, సుజనమ్మలు సుమారు 50 సంవత్సరాల క్రితం బొబ్బిలి నుంచి ఉపాధి కోసం మండపేట వచ్చారు. అయితే మండపేట పట్టణంలో ఇంటి అద్దెలు భరించలేక సమీపంలో ఏడిద గ్రామం చేరుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. సుమారు 40 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇల్లు లేని వారికి కట్టించిన కాలనీ ఇల్లు(పెంకుటిల్లు) ఇచ్చారు. ఇప్పటికీ పెంకులూడిపోయిన ఆ ఇల్లే అతనికి ఆధారం.*

*వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అయితే వీరిని చదివించడం సాధ్యం కాదని పెద్దబ్బాయిని బొబ్బిలిలోని వాళ్ళ బంధువులకు ఇచ్చేశారు. ఇద్దరు అబ్బాయిలను కూలి పనులకు తీసుకెళ్లకుండా చదివించడం మొదలుపెట్టారు. అలా పదో తరగతి రాంబాబు, రమేష్ సోదరులు పూర్తి చేశారు. రాంబాబుకు రమేష్ అన్నయ్య కాదు స్నేహితుడు కూడా అని చెప్పాలి. వీరు వలస రావడం వల్ల వీరికి ఇక్కడ బంధువులంటూ ఎవరూ ఉండేవారు కాదు. అలాగే స్నేహితులు కూడా లేకపోవడంతో… అన్నయ్య లోనే స్నేహితులను చూసుకునేవాడు. ఇంటర్మీడియట్ మండపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివేందుకు MPC గ్రూప్ కు దరఖాస్తు చేశారు. అయితే ఆ తండ్రి ఎంపీసీ గ్రూప్ కి ఖర్చు ఎక్కువవుతుంది చదివించలేను, సిఇసి తీసుకోమని చెప్పాడు. అయితే మండపేట కాలేజీలో ఆ సీట్లు పూర్తయి పోయాయి. దీంతో కడియం మండలం మురమండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీఈసీ లో చేరారు. ఏడిద నుండి సైకిల్ పై మురమండ వెళ్ళి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కళాశాలలో BA డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు. అలాగే శ్రీకాకుళంలో ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు.*

*అనంతరం రాంబాబు బీ.ఈడీ.కి ఎంట్రన్స్ పరీక్ష రాశారు. మచిలీపట్నం నేషనల్ కళాశాలలో సీటు వచ్చింది. కానీ, చదువుకోవడానికి మాత్రం డబ్బులు లేవు. ఏడిది రథం వీధిలో ఉండే రాజు మాస్టర్ కి ఈ కుర్రాడి పరిస్థితి తెలుసుకుని ప్రోత్సహించారు. బీ.ఈడీ. అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి, కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. అలాగే ఆ పక్క గ్రామం కొత్తపేట ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసే ప్రసాద్ మాస్టారుకు పరిచయం చేశారు. అక్కడ ఆ మాస్టర్ తో పాటు దుళ్ల గ్రామానికి చెందిన కంటిపూడి సత్యనారాయణ మాస్టారులు ఇతనిని దాతల వద్దకు తీసుకెళ్లారు. ప్రసాద్ మాస్టారు తన మోటార్ సైకిల్ పై రాంబాబుని _”అర్తమూరు సత్తి బులిస్వామి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్, ఆలమూరు సమతా స్వచ్ఛంద సేవా సంస్థ, రావులపాలెం రాఘవేంద్ర కంటి ఆసుపత్రికి చెందిన ట్రస్ట్”_ ద్వారా కొంత నిధులను సమకూర్చి బీ.ఈడీ. పూర్తి చేయడానికి కారకులయ్యారు.*

*అప్పటి నుంచి టీచర్ అవ్వటానికి రాంబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. 2008 డీఎస్సీలో తొలి ప్రయత్నం లోనే ఎంపికయ్యాడు. సర్టిఫికెట్లు పరిశీలన కూడా పూర్తయింది. నియామక ఉత్తర్వులు రావడమే ఆలస్యం. ఇంతలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో కొందరి ఉద్యోగాలు తారుమారయ్యాయి. అటువంటి దురదృష్టవంతులలో ఈ రాంబాబు ఉండటం చాలా బాధాకరం. ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.*

*ఇక 2012లో డీఎస్సీపరీక్షలకు సిద్ధమవుతుండగా తల్లి సుజనమ్మకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో తల్లిని చూసుకోవడంలో ఉండిపోయాడు. చివరకు ఆమె మరణించింది. అటువంటి పరిస్థితుల్లో ఆ పరీక్షల్లో విజయం సాధించలేకపోయారు. అంటే అతన్ని దురదృష్టం ఏవిధంగా వెంటాడుతుందో… చూడండి. 2018 డీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతుండగా తండ్రి సంగయ్యకు జరిగిన ప్రమాదంలో కాలు విరిగిపోయింది. అతని సంరక్షణ చూసుకుంటూ ఆసుపత్రిలోనే ఉండిపోవడం వల్ల ఆ పరీక్షల్లో కూడా గెలవలేకపోయారు.*

*ఇతను ఎమ్‌.ఎ, బి.ఈడీ. చదవడం వల్ల పలు కాన్వెంట్లు, ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉండేవారు.*

*ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా యావత్తు ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి ఈ కుటుంబాన్ని పొట్టనపెట్టుకుంది. తండ్రి సంగయ్య, అక్క బొత్సా లక్ష్మీ, స్నేహితుడు లాంటి అన్నయ్య రమేష్ లు రెండు వారాల వ్యవధిలోనే రాంబాబు కళ్లముందే మృతి చెందారు. రాంబాబు ఒంటరి వాడైపోయాడు. అతనికి మానసిక ఒత్తిడి ఎక్కువై పోయింది. అలాంటి పరిస్థితుల్లో మరో అక్క రాజాన సుందరమ్మ ఏడిదకు వచ్చి రాంబాబుకు వండి పెడుతున్నది. ఎంత చదువు చదివినా పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి. దుర్బలమైన ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడు తున్నందున వీరిని చూసేవారెవరూ లేకుండా పోయారు. కనీసం జాలి పడేవారు కూడా ‌లేరు‌. ఇతనికి పట్టిన దరిద్రం తమకు ఎక్కడ అంటుకుంటుందో నని దూరం దూరంగా ఉండేవారు.*

*ఇలాంటి పరిస్థితుల్లో ఆలమూరు మండలం చెముడులంక హై స్కూల్ పక్కన ఉన్న గుప్తా రైస్ స్టోర్ లో పనికి చేరాడు. ఇతని చదువును చూసి ఆ యాజమాన్యం బరువు పనులు చెప్పకుండా తేలికపాటి పనుల బాధ్యతలు ఇచ్చేవారు. ఎంతో నమ్మకంగా పనిచేయడంతో వారు రాంబాబును పనివాడుగా కాకుండా ఆప్యాయతగా చూసుకునేవారు. సైకిల్ పైనే ఏడిద నుంచి చెముడులంక రోజు వెళ్లి వచ్చేవారు. ఇలాంటి పరిస్థితుల్లో 2025-డీఎస్సీ.ని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో యాజమాన్యం కొంతకాలం పని మానేసి చదువుకోమని సూచించారు. అయితే కోచింగ్ సెంటర్ కు వెళ్లే ఆర్థిక పరిస్థితులు లేకపోవడం వల్ల తెలిసిన వారి వద్ద పుస్తకాలు తీసుకుని రేయింబవళ్ళు చదువుతూనే ఉన్నాడు. అంటే “కసి” అనేదానికి ఇది చివరిదశ అన్నమాట. ఆ స్థాయిలో చదివాడు. అలా చదవడం కూడా ప్రమాదమే కదా..! అదే జరిగింది. ఇంట్లోనే పడిపోతూ ఉండేవాడు. ఇదేంటని ఆసుపత్రికి తీసుకెళ్తే ఇతనికి ఎక్కువగా చదువుతూ ఉండటం వల్ల నిద్రలేక కంటికి రెట్టిగో అనే వ్యాధి సోకింది రెస్ట్ కావాలన్నారు.*

*అంతే మళ్ళీ తన పని అయిపోయింది అనుకున్నాడు. అలాగే మందులు వాడుతూ ఆ చదువును కొనసాగిస్తూ వచ్చాడు. ఎక్కడా నిరుత్సాహం అనేదాన్ని తన దరిదాపుల్లోకి రానీయకుండా చూసుకున్నాడు. చివరకి అమలాపురం సమీపంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాయడానికి వెళ్లాడు. పరీక్షా రాస్తూనే మధ్యలో కుప్పకూలి పోయాడు. ఇన్విజిలేటర్లు ఏంటి విషయం అని ఆరా తీశారు. పరిస్థితి వివరించాడు. మందులు వేసుకుని మళ్లీ పరీక్ష రాయడం మొదలు పెట్టాడు. ఆ విధంగా సుమారు 15 నిమిషాలు పరీక్షా సమయం వృధా అయిపోయింది.*

*🤔ఈ పరిస్థితుల్లో ఈ పరీక్షలో కూడా గెలవలేననే నిర్ణయానికి వచ్చేశాడు. కానీ, ఫలితాలు చూస్తే✌️ పూర్తిగా రాంబాబు వైపుకు వచ్చేశాయి. ముందుగానే చెప్పాను కదా! ఇతన్ని వెంటాడిన పేదరికం, దారిద్ర్యం వంటివన్నీ జాలిపడ్డాయి. ఇక అతన్ని ఇబ్బంది పెడితే అర్థమే ఉండదనుకున్నాయి. అందుకనే ఒకే పరీక్షలో రెండు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు.😲😃 వాటిల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ (ఎస్సీ కేటగిరీలో 75వ రోస్టర్ పాయింట్) ను 💪ఎంచుకున్నాడు. దీనితో పాటు టిజిటి 138 వ ర్యాంకు సాధించారు.👍*

*చూశారా…… రాంబాబు జీవితంలో ఓడిపోయి, పడిపోయి మళ్లీ లేచి ఎలా నిలబడ్డారో….!!!!! యావత్తు ప్రపంచానికి చాటి చెప్పింది ఏంటంటే నిరుత్సాహాన్ని దరి చేరనీయకుండా కష్టపడి చదివితే, లక్ష్యం చేరుకోవచ్చని.💪💪*

*రాంబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. అతను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనసారా మా యాజమాన్యం తరుపున కోరుకుంటున్నాం.
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*_:{ఒక ఫేస్బుక్ పోస్టు ఇది… ఈ సందర్భంగా నేటి యువతీ యువకులకు మా తరుపున ఓ విన్నపం……. ఈ రాంబాబుని స్ఫూర్తిగా తీసుకుని, మొక్కవోని సంకల్పబలంతో.. సాధనచేసి, కష్టాల నుంచి బయటపడి అనుకున్నది సాధించి, ఎత్తులకు ఎదగాలి. అలాగే మరి కొంతమందికి ప్రోత్సాహం కలిగిస్తూ, సాయం చేసే స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములతో… పున్నమి దినపత్రిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.