అచ్చులతో
మాబడి
గేయం
అదిగో అదిగో మా బడి
ఆనందాల నారు మడి
ఇలలో వెలసిన అసలు గుడి
ఈలలు వేస్తూ పరుగులు తీసే మా బడి
ఉత్సాహాల మాబడి
ఊయలలూపే మా బడి
ఋణమే తీర్చమంది మా బడి
పితౄణమే తీర్చమంది మా బడి
ఎప్పటిపని అప్పుడే చేయమన్నది
మా బడి
ఏనుగు అంత బలంగా ఉండాలన్నది మా బడి
ఐకమత్యమే మహాబలo అన్నది
మా బడి
ఒoటెలాగా ఓర్పుగా ఉండాలన్నది మా బడి
ఓర్పు నేర్పు నీకుంటే సాధ్యం కానిది లేదన్నది
ఔరా అంటూ అందరూ ఆశ్చర్య పోతారన్నది
అందాలా మాబడి
ఆహ్లాదాలా పెట్టుబడి
అoత:పురమే మాబడి
ప్రాతఃకాలమే తెరువు బడి
రచన:
గుండాల నరేంద్రబాబు
తెలుగు పరిశోధకులు
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. తేది:20-05-2022
సెల్: 9493235992.