భూసేకరణ ప్రక్రియ మరింత వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ చక్రధర బాబు
జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను మరింత వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కెవీఎన్ చక్రధర్ బాబు *అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారుల భూసేకరణ, పరిహారం చెల్లింపులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ హెచ్ 67, 71, 167 బి, 167బిజి, కృష్ణపట్నం పోర్ట్ అనుసంధాన రహదారుల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ, నగదు చెల్లింపుల ప్రక్రియను త్వరగా పూర్తిచేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఎఫ్వో షణ్ముఖ కుమార్, ట్రైనీ కలెక్టర్ పర్హాన్ అహ్మద్ ఖాన్, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట ఆర్డివోలు హుస్సేన్ సాహెబ్, మురళీకృష్ణ, సరోజినీ, నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గోవర్ధన్, హైవేస్ తిరుపతి టెక్నికల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ తాసిల్దార్లు దానియేలు, శాంతకుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.
……………….

