కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఇడిమేపల్లి సర్పంచ్ యశస్విని
వెంకటాచలం, ఏప్రిల్ 29 (పున్నమి విలేకరి):
కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇడిమేపల్లి సర్పంచ్ యశస్విని సూచించారు. ఇడిమేపల్లి గ్రామంలో గురువారం పంచాయతీ కార్యదర్శి సుబ్బారావుతో కలిసి పాజిటివ్ కేసులు ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. పలు జాగ్రత్తలు పాటించాలని, ఇంటి వద్దనే ఉండాలని తెలియజేశారు. అదే విధంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు. ముఖ్యమైన పని ఉంటే తప్ప అనవసరంగా బయట తిరిగి వద్దన్నారు. ఇంట్లోనే ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆనంతరం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లి ప్రతి ఇంటి గేట్లకు ద్వారాల వద్ద హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ సాయి తదితరులు పాల్గొన్నారు.