మీరు బిజీబిజీనా…. ప్రాణానికి ముప్పు జాగ్రత్త….

0
197
Smiling woman cutting zucchini in kitchen at home

చాలామంది ఆడవాళ్లు తమ ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పనిచేస్తుంటారు. పని అయిపోవడమే ముఖ్యమని భావిస్తుంటారు. అంతేకాదు, ఎంత ఎక్కువ శారీరక శ్రమ చేస్తే అంత గొప్ప? అనే భావన సైతం మహిళల్లో ఉంటుంది. మన సినిమాలు సాహిత్యం లాంటివి కూడా అలాగే చూపుతుంటాయి. ముగ్గులేస్తే అయిదోతనమని, ఇల్లు ఊడిస్తే ఇంటిదీపమని? ఇలా మహిళల భావోద్వేగాలకు చాకిరిని ముడిపెట్టి, మళ్లీ వాటికి అందమైన సాహిత్యంగా పేరుపెట్టి సమాజంలోకి ఎక్కించారు. కాస్త పదజాలం మారి?అవన్నీ ఇప్పుడు ఆధునిక మహిళల సామర్ధ్యాలుగా, మల్టీ టాస్కింగ్‌గా మనముందుకు వస్తున్నాయి. ఇంటిపనిని పనిలాగే చూస్తే సరిపోతుంది. అప్పుడు ఇంట్లో ఉన్న వారందరూ అన్ని పనులను చేసే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఇంటి చాకిరికి స్త్రీత్వాన్ని జోడించడం, ఉత్తమ మహిళల లక్షణాలుగా పనులను పేర్కొనటం?ఎంత తెలివితక్కువ వారికైనా అర్థమైపోతుంది?ఇదంతా చాలా చాకచక్యంతో చేస్తున్న మోసమని.
ఆహారం, పని, విశ్రాంతి, నిద్ర ఇవి జీవులన్నింటికీ సమానమే. పనిఒత్తిడితో వీటి మధ్య సమన్వయం లోపిస్తే?మహిళల ప్రాణాలకే ముప్పని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏకకాలంలో అనేక పనులను నిర్వహిస్తూ ఇంటిపని, ఆఫీసులో ఒత్తిళ్లతో తలమునకలయ్యే మహిళలకు జీవిత కాలం తగ్గిపోతుందని అమెరికాలోని ఒహాయో స్టేట్‌ ‌వర్శిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారంలో 40 గంటలకు మించి 30 ఏళ్లపాటు నిరంతరాయంగా శ్రమించిన మహిళలకు మధుమేహం, క్యాన్సర్‌, ‌గుండెజబ్బులు త్వరగా వచ్చే అవకాశం ఉందని అధ్యయనాల్లో రుజువైనట్టుగా వారు వెల్లడించారు. అలాగే వారానికి పనిగంటలు 60 కంటే ఎక్కువుంటే వారిలో ఈ ముప్పు మూడురెట్లు పెరుగుతుంది. అయితే పురుషులు ఇంతగానూ శ్రమించినా వారిలో వ్యతిరేక ప్రభావాలు మహిళల స్థాయిలో కనిపించలేదని వారు వెల్లడించారు. అందుకే అందరికీ న్యాయం చేయాలని తపించే ముందు మహిళలు, తమకు తాము కూడా న్యాయం చేసుకోవాలని ఆలోచించాల్సిందే మరి.

0
0