తూర్పుగోదావరిజిల్లా ,అమలాపురం
కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉండడంతో ప్రజల్లో వైరస్ పట్ల అవగాహన కల్పించే దిశగా అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ భాష మరియు అధికారులు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా అమలాపురం పట్టణ సి.ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో కరోన వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.మాస్కులు తప్పని సరిగా ధరించాలని లేనియెడల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.పట్టణం లోని ప్రధాన కూడళ్లలో ఎస్ఐ శ్రీనివాస్, శివ ప్రసాద్, ఏసుబాబు లు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నవారికి కరోనా వైరస్ గురించి దాని వ్యాప్తి పట్ల అవగాహన కల్పించారు.బయటికి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పక ధరించాలని సూచించారు. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లి సెంటర్లో అమలాపురం రూరల్ ఎస్.ఐ రాజేష్ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.మాస్కులు లేకుండా సంచరిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు. షాపుల వద్ద జనాలు గుమిగూడి ఉండరాదని, భౌతిక దూరం తప్పక పాటించాలని సూచించారు.మాస్కులు ధరించకపోతే జరిమానాలు తప్పవని హెచ్చరించారు.