శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు కలెక్టర్ కు వినతి.

0
109

శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కారానికై జూన్ 15న మహరాయభారం జయప్రదం చేయాలని కార్మిక,కర్షక,ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రజా సంఘాల నాయుకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక,ఉద్యోగ, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో  కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లే కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ జె.నివాస్ గారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయుకులు మాట్లాడుతూ పొందూరు వద్ద గల  శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ పరిశ్రమ యాజమాన్యం గత 10 సంవత్సరాలు నుండి కనీస వేతనాలు, పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ గుర్తింపు కార్డులు, విడిఎ, చట్టబద్దమైన సెలవులు వంటి చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయడం లేదని తెలిపారు. అమలు చేయాలని కోరితే పరిశ్రమలో పనిచేస్తున్న 8మంది కార్మికులను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా శ్రీ రాజ్యలక్ష్మి పరిశ్రమ యాజమాన్యం అక్రమంగా ఉద్యోగాలు నుండి తొలగించిందని అన్నారు. చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని అడుగుతున్నారని యాజమాన్యం ఏకపక్షంగా ఎటువంటి తప్పు లేకపోయినా కక్ష పూరితంగా తొలగించింది. ఇలా తొలగించడం  చట్ట వ్యతిరేక చర్య అని అన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఏ ఒక్క పరిశ్రమ యాజమాన్యం ఏ ఒక్క కార్మికుడిని తొలగించరాదని ఆదేశాలు ఇచ్చినప్పటికీ శ్రీ రాజ్యలక్ష్మి పి.ఎస్.సి.సి యాజమాన్యం కార్మికులను అన్యాయంగా, ఏకపక్షంగా తొలగించడం కార్మిక చట్టాలకు విరుద్దమైన చర్య అని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కాలానికి కార్మికులందరికీ పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయని, శ్రీ రాజ్యలక్ష్మి పరిశ్రమలో పనిచేస్తున్న కొంతమందికి లాక్ డౌన్ కాలానికి యాజమాన్యం వేతనాలు చెల్లించి కొంతమందికి చెల్లించలేదని ఇది చట్టవ్యతిరేక చర్య అని అన్నారు. యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు తలపడుతున్నదని యూనియన్ ను లేకుండా చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ యూనియన్ నాయకులను ఉద్యోగాలను నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. యాజమాన్యం కార్మికులపై వేధింపులు కక్షసాధింపు చర్యలు చేస్తుందని అన్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీసుకు పాల్పడుతుందని అన్నారు. కార్మికుల శ్రమతో కోట్లాది రూపాయలు లాభాలు అర్జించిన రాజ్యలక్ష్మి యాజమాన్యం నేడు కార్మికులను రోడ్డు పాలు చేసి ప్రభుత్వ అండతో కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తూ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. యాజమాన్యం కార్మిక సమస్యలు పరిష్కరించకుండా మద్యం, డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లి పారిశ్రామిక అశాంతి సృష్టిస్తుందని విమర్శించారు. చట్టాలన్నింటిని ధిక్కరించి కార్మికులపై పగ సాధిస్తున్న శ్రీ రాజ్యలక్ష్మి యాజమాన్యం దుశ్చర్యలను అన్ని కార్మిక, ప్రజా సంఘాల నాయుకులు ఖండించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కాలానికి కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేసారు. కార్మికశాఖ అధికారులు నిర్వహించిన జాయింట్ సమావేశాలకు హజరుకాకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సమస్యలు పరిష్కారానికి హక్కుల సాధనకు శ్రీ రాజ్యలక్ష్మి పవర్ ఇన్ ఫ్రా వర్కర్స్ యూనియన్ ఆద్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు అన్ని కార్మిక,ప్రజా సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. తక్షణం ప్రభుత్వం యంత్రాంగం జోక్యం చేసుకొని  కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న శ్రీ రాజ్యలక్ష్మి పి.ఎస్.సి.సి యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా, ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కాలానికి కార్మికులందరికీ వేతనాలు చెల్లించేలా, కనీస వేతనాలు, పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ మొదలగు చట్టపర సౌకర్యాలు అమలు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని జూన్15న  యాజమాన్యానికి మహరాయభారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం,  మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లు.మహాలక్ష్మి, యుటిఎఫ్ జిల్లా కోశాధికారి పొందూరు అప్పారావు, జిల్లా కార్యదర్శి ఎండ ఉమాశంకర్ స్మార్ట్ కెమ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.జగ్గారావు, శ్యాంపిస్టన్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గొర్లె.కిరణ్, శ్యామ్ సుందర్,కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలాకి. ప్రసాదురావు, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మీ, వి.ఆర్.ఎ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు. సత్యనారాయణ, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు  డి.పార్