దర్శి, జూన్ 4, 2020(పున్నమి విలేఖరి): మల్లవరం గ్రామంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనీమూన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఎంఎల్ఎ కుందురు నాగార్జున రెడ్డి పాలాభిషేకం నిర్వహించిన వైస్సార్ వాహనమిత్ర పథకం లబ్ధిదారులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనీమూన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కరోనా కారణంగా పనుల్లేక, క్యాబ్‌లు తిప్పేందుకు వీల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిన ఈరోజుల్లో, ఎవరూ అడగకుండానే ఈ ఏడాదికి గాను నాలుగు నెలలు ముందుగానే వైస్సార్ వాహన మిత్ర పధకం కింద రూ.10 వేల సాయం అందించిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. లబ్ధిదారుల్లో అత్యధికులు బిసిలే అని తెలియచేసారు. ఈ సంవత్సరం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేలు చొప్పున జమ చేయబోతున్నారు అన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో 61,390 మంది ఎస్సీలు, 1,17,096 మంది బీసీలు, 14,592 మంది ఈబీసీలు, 29,643 మంది కాపులు, 10,049 మంది ఎస్టీలు, 28,118 మంది మైనార్టీలు, 581 మంది బ్రాహ్మణులు, 1,026 మంది క్రైస్తవులు ఉన్నారు. అడగకుండానే ఆదుకుంటున్నారు. కరోనా కారణంగా పనుల్లేక, ఆటోలు తిప్పలేక అనేక ఇబ్బందులు పడుతున్న రోజుల్లో మేం అడగకుండానే నాలుగు నెలలు ముందుగానే రూ.10 వేల సాయం అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. గతేడాది అందించిన ఆర్థిక సాయంతో వాహనాలకు బీమా, ఫిట్‌నెస్, మరమ్మతులు చేయించుకున్నాం. తాళ్లూరి యోహాను, ఆటోడ్రైవర్, మల్లవరం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనీమూన్ శ్రీనివాసరెడ్డి, వైస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులు, చిన్నబ్బయ్య, మాజీ ఎంపీపీ వై వెంకటేశ్వర్లు, ఆర్. శ్రీను, ఆర్. హనుమంతరావు, ఆర్. నరసింహారావు, యేసురావు, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.