ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.
పలమనేరు మే31,2020(పున్నమి విలేకరి సుదర్శన్): పలమనేరు నియోజకవర్గంలో ఒక పాస్టరు 6 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ప్రేమించి గర్భం చేసి, తీయించేసి,వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని జంగాల అగ్రహారం గ్రామంలో ఫాస్టర్ రాజకుమార్, అదే ఊరుకు చెందిన ధనలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు, అమ్మాయిని గర్భవతి చేసాడు, మాయమాటలు చెప్పి కడుపు తీయించేశాడు,ఏళ్లుగడిచినా ఏదో కుంటి సాకులు చెబుతూ కాలం వెళ్లదీసి, విషయం పెద్దలదాక వెళ్లిన తరుణం లో 6 నెలల తరువాత తన పాస్టర్ ట్రైనింగ్ పూర్తి చేసిన తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.ఇప్పుడు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని తన గ్రామానికి తీసుకురావడంతో ధనలక్ష్మి బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ చేరుకొని పాస్టర్ రాజ్ కుమార్ మీద పిర్యాదు చేయడం తో బైరెడ్డిపల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.