రాపూరు మండలం లో 18 రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం

    0
    184

    రాపూరు, మే 30, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండల పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 18 సచివాలయాలకు సంబంధించి 18 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు ఇందులో భాగంగా సంక్రాంతి పల్లి సచివాలయానికి పోకూరుపల్లి కమ్యూనిటీ హాల్ నందు రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ ప్రెసిడెంట్ చెన్ను భాస్కర్ రెడ్డి ప్రారంభించి ఇకనుండి రైతులకు వ్యవసాయ శాఖ సేవలను గ్రామ స్థాయిలో పొందవచ్చు అనగా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు రైతు భరోసా కేంద్రాల నుండి సరఫరా చేస్తారు అని ప్రతి ఒక్క రైతుక ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రతాప్, పొదలకురు సహాయ వ్యవసాయ సంచాలకులు కె.నాగేశ్వరరావు మరియు రైతులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.మరియు రాపూరు మూడవ సచివాలయం అనుసంధాన రైతు భరోసా కేంద్రం నవాపేట నుందు ఏర్పాటు చేయగా ఈ కేంద్రాన్నిఎంపీడీఓ ఆమోష బాబు ,EOPRD గంగయ్య , వ్యవసాయ విస్తరణ అధికారి బి.రాజ మోహన్ రెడ్డి ,శ్రీకిరెడ్డి శేశిధర్ రెడ్డి,ముని ప్రసాద ,మిగిలిన అన్ని రైతు భరోసా కేంద్రాలలో గ్రామ వ్యవసాయ సహాయకులు,సచివాలయం సిబ్బంది, రైతులు ,గ్రామ వలంటరీలు తదితరులు పాల్గొన్నారు.