రాపూరు, మే 30, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) :
రాపూరు పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులు తనిఖీచేసి సిబ్బందికి పలు సూచనలు సలహాలు తెలియజేశారు అనంతరం గ్రామ పోలీసులకు గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా. ముఖ్యంగా చెన్నై నుంచి ఎవరైనా వ్యక్తులు వస్తే వారి సమాచారాన్ని పోలీసు స్టేషన్లోని అధికారులకు తెలియపరచాలని తెలియజేశారు తదుపరి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాపూరు మండలంలో తొలి కరోనా కేసు నమోదైనదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేసు నమోదైన ప్రాతంలో కొన్ని రోజులు ప్రత్యేక ఆంక్షలు ఉంటాయని గ్రామస్తులు వాటిని తప్పక పాటించాలి లేనియెడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాయనపల్లి గ్రామానికి నిత్యావసర సరుకులు, కూరగాయలు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూసుకుంటామని తెలిపారు మరియు రాపూరు మండలం లోని ప్రజలు ఎవరైనా మండలంలో కి లేదా వారి గ్రామాలలో కి కొత్త వ్యక్తులు వచ్చిన, వివిధ ప్రాంతాలలో పని చేస్తూ తిరిగి సొంత ఊర్లకు వచ్చిన వారి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ లో లేదా రెవెన్యూ సిబ్బందికి తెలుపవలసిందిగా కోరారు.