రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం మహాదేవమంగళం గ్రామానికి చెందిన రామిరెడ్డి కుమారుడు కే వెంకటేశ్వర రెడ్డి (60) ఆదివారం సాయంత్రం పడిన అకాల వర్షం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న తన చెఱకు గానుగ షెడ్డు వద్ద ఉన్న కొబ్బరి చెట్టు మీద పిడుగు పడి పూర్తిగా కాలిపోయి ప్రక్కనే వున్న కే. వెంకటేశ్వర రెడ్డి అనే రైతు అక్కడికక్కడే మృతి* చెందాడు.ఇతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.విషయం తెలుసుకున్న రెవెన్యూ మరియు పోలీసు అధికారులు దుర్ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.