ఈ నెల 6న వారికి రూ.10 వేలు

0
104

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️

లాక్ డౌన్ నేపథ్యంలో చేపల వేతపై నిషేధం ఉన్న క్రమంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. మత్స్యకారుల విరామ భృతి కింద రూ.10 వేలు అందించాలని నిర్ణయించింది.ఈ నెల 6న దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనుండగా…ఆ రోజే వారి అకౌంట్లో రూ.10 వేలు జమ చేయనున్నారు. ఇప్పటికే లబ్దిదారుల పేర్లను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు.