*_!!సమాజ అభివృద్ధి జరగాలంటే౼దేశంలో నిరుద్యోగం అంతం కావాలి!!_*
*_!!యువత నిర్లక్ష్యం విడి౼ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి!!_*
*_సిద్దిపేట: సమాజంలో ప్రతి వ్యక్తికి ఈ పాలక ప్రభుత్వలు ప్రభుత్వ ,ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించి,నిరుద్యోగాన్ని అంతం చేసినప్పుడే సమాజ అభివృద్ధి, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అఖిల భారత యువజన సమాఖ్య(AIYF)జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్ అన్నారు._*
*_ఆదివారం రోజు AIYF61వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్థానిక ఎడ్ల గురువారెడ్డి భవన్ వద్ద AIYF జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ…యువత నిర్లక్ష్యం దేశానికి పెను ప్రమాదం అని.నిర్లక్ష్యం విడి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై ప్రశ్నించే తత్వన్నీ అలవర్చుకోని అదేవిధంగా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర ప్రధానమైనది అన్నారు.యువతరంలో ప్రగతి శీల అభ్యుదయ భావాలను , దేశభక్తి లౌకిక ప్రజాస్వామిక ఆలోచనలను నైతిక విలువలను మానవత్వాన్ని నెలకోల్పడానికి అఖిల భారత యువజన సమాఖ్య AIYF నిరంతరం కృషి చేస్తుందని అదేవిధంగా దేశం కోసం ప్రాణార్పన చేసిన సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు లాంటి అమరవీరుల వారసత్వం పునికి పుచ్చుకుని దేశ స్వతంత్రం అనంతరం నల్లదోరలను దోపిడీని అడ్డుకునేందు కై 1959 మే 3వ తేదీ న అఖిల భారత యువజన సమైక్య AIYF ఢిల్లీలో ఆవిర్భావించిందని,18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతకు ఓటు హక్కు కోసం పోరాడి విజయం సాదించిందన్నారు. జాబ్ OR జైలు పనైనా చూపండి తిండైనా పెట్టండి అనే నినాదంతో యువత గొంతుకై గర్జించిన ఎకైక యువజన సంఘం AIYF అని అయన కొనియాడారు,అవినీతి అంతం AIYF పంతం అనే నినాదంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ అనేక ఉద్యమాలు నిర్మిస్తుందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల పై బడిన వివిధ శాఖల ఉద్యోగాలను భర్తీ చేయాలని , నిరుద్యోగభ్రృతి వేంటనే ప్రభుత్వంను డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో AIYF జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డు నరేష్, పట్టణ నాయకులు ప్రభాకర్, సురేష్, రాజు,కుమార్ లు పాల్గొన్నారు._*