నెల్లూరు, జనవరి 16, 2020 (పున్నమి విలేఖరి) : ప్రముఖ రైల్వే కార్మికోద్యమ నాయకుడు, కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ వెంకటరత్నం అనారోగ్యంతో 16-01-2020 ఉదయం 6-50 గంటలకు నెల్లూరులో మరణించారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.
ఆయన పార్థివ దేహాన్ని పొదలకూరు రోడ్డు, ఎస్‌బిఐ కాలనీలోని ఆయన స్వగృహం వద్ద అభిమానుల దర్శనార్ధం వుంచారు. యుసిసిఆర్‌ఐ (యంఎల్) నాయకులు కా.సి.భాస్కర్ దివంగత నాయకుని పార్థివ దేహం పై ఎర్రజెండా కప్పి ఘనమైన నివాళులర్పించారు. తన జీవితం చివరి క్షణం వరకు దేశంలో పీడిత ప్రజల రాజ్యం కోసం కృషి చేసిన గొప్ప కమ్యూనిస్టు విప్లవకారుడని, కా.తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులు రూపొందించిన విప్లవ పంథాను దృఢంగా నమ్మి ఆ బాటలో కృషి చేసిన కార్మికోద్యమ నేత ఆయన అని కా.భాస్కర్ అమరులైన నేతకు నివాళులర్పించారు.
ఓపిడిఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కా.కె.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కా.రత్నం రైల్వే కార్మికోద్యమానికి, సమసమాజ స్థాపనకు అందించిన సేవలను వివరిస్తూ ఆయన ఆశయాల పరిపూర్తికి కృషి సల్పటమే ఆయనకు నిజమైన నివాళలని అన్నారు. ఏపిటిఎఫ్ రాష్ట్ర నాయకులు కె.వెంకటేశ్వరరావు దివంగత కార్మికోద్యమనాయకుడు రత్నం పీడిత ప్రజలకు, విచక్షణకు గురైన ప్రజలకు అందించిన సేవలను, చేపట్టిన కార్యకలాపాలను వివరించారు. జోహార్ కా.రత్నం, అమర్ హై కా.రత్నం అన్న నినాదాలతో పార్థివ దేహాన్ని దివంగత నాయకుని కోరిక మేరకు స్థానిక మెడికల్ కాలేజీకి దానం చేశారు. పై సంతాప కార్యక్రమంలో బంధుమిత్రులు పాల్గొన్నారు. దివంగత నాయకునికి తన జీవితం చివరి రోజుల్లో అనేక విధాలుగా సేవలందించి సహకరించిన బంధువులను వక్తలు కొనియాడారు.

నెల్లూరు, జనవరి 16, 2020 (పున్నమి విలేఖరి) : ప్రముఖ రైల్వే కార్మికోద్యమ నాయకుడు, కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ వెంకటరత్నం అనారోగ్యంతో 16-01-2020 ఉదయం 6-50 గంటలకు నెల్లూరులో మరణించారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయన పార్థివ దేహాన్ని పొదలకూరు రోడ్డు, ఎస్‌బిఐ కాలనీలోని ఆయన స్వగృహం వద్ద అభిమానుల దర్శనార్ధం వుంచారు. యుసిసిఆర్‌ఐ (యంఎల్) నాయకులు కా.సి.భాస్కర్ దివంగత నాయకుని పార్థివ దేహం పై ఎర్రజెండా కప్పి ఘనమైన నివాళులర్పించారు. తన జీవితం చివరి క్షణం వరకు దేశంలో పీడిత ప్రజల రాజ్యం కోసం కృషి చేసిన గొప్ప కమ్యూనిస్టు విప్లవకారుడని, కా.తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులు రూపొందించిన విప్లవ పంథాను దృఢంగా నమ్మి ఆ బాటలో కృషి చేసిన కార్మికోద్యమ నేత ఆయన అని కా.భాస్కర్ అమరులైన నేతకు నివాళులర్పించారు. ఓపిడిఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కా.కె.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కా.రత్నం రైల్వే కార్మికోద్యమానికి, సమసమాజ స్థాపనకు అందించిన సేవలను వివరిస్తూ ఆయన ఆశయాల పరిపూర్తికి కృషి సల్పటమే ఆయనకు నిజమైన నివాళలని అన్నారు. ఏపిటిఎఫ్ రాష్ట్ర నాయకులు కె.వెంకటేశ్వరరావు దివంగత కార్మికోద్యమనాయకుడు రత్నం పీడిత ప్రజలకు, విచక్షణకు గురైన ప్రజలకు అందించిన సేవలను, చేపట్టిన కార్యకలాపాలను వివరించారు. జోహార్ కా.రత్నం, అమర్ హై కా.రత్నం అన్న నినాదాలతో పార్థివ దేహాన్ని దివంగత నాయకుని కోరిక మేరకు స్థానిక మెడికల్ కాలేజీకి దానం చేశారు. పై సంతాప కార్యక్రమంలో బంధుమిత్రులు పాల్గొన్నారు. దివంగత నాయకునికి తన జీవితం చివరి రోజుల్లో అనేక విధాలుగా సేవలందించి సహకరించిన బంధువులను వక్తలు కొనియాడారు.