కొండాపురం: మండలంలోని తూర్పుపాలెం గ్రామంలో పశువుల చోరీ ఘటన చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన బండ్లమూడి బాలకృష్ణ ఇంటి సమీపంలో కట్టివేసిన రెండు గేదెలు, ఒక దూడను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు బాధితుడు తెలిపారు. చోరీకి గురైన పశువుల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై బాలకృష్ణ కొండాపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పశువుల ఆచూకీ కోసం వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
కొండాపురంలో మూడు పశువులు అపహరణ