వివాదాలకు కేరాఫ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
ఆయన ఓ విద్యార్థి ఉద్యమ నాయకుడు ఆల్మట్టి ప్రాజెక్టు వల్ల ఇబ్బందులున్నాయంటూ సుదీర్ఘ పోరాటాలు చేసిన నేత. సాధారణ కుటుంబం నుంచి విద్యార్థి ఉద్యమ నేతగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఎరిగిన వ్యక్తి కూడా. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. రాజకీయంగా ఎలాంటి పూర్వ నేపథ్యం లేకుండా రెండు సార్లు శాసనసభ్యులయ్యారు. అధికారం చేపట్టిన అనంతరం అనుచరుల ప్రభావమో, కేడర్‌కు అండగా వుంటానన్న భరోసా కోసమో గత కొద్ది కాలంగా రాజకీయ వివాదస్పదుడిగా మారారు. ప్రత్యేకించి నెల్లూరు రూరల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌రెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు నుంచే దూకుడు పెంచారు. బెదిరింపులు, హుంకరింపులు, హెచ్చరికలు ఆ పై రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు అంతలోనే వివరణలు ఇలా అడుగడుగునా ఆయన అధికార పార్టీలో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఒకప్పటి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, దివంగత ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల అనుచరుడిగా రాజకీయ మెట్లెక్కి శాసనసభ్యుడిగా ఎదిగిన శ్రీధర్ రెడ్డి రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాలలో వివాదాలకు కేరాఫ్‌గా మారారు. తాజాగా వెంకటాచలం ఎంపీడీవో సరళ పై దౌర్జన్యం చేశారంటూ గత రాత్రి నుంచి శ్రీధర్ రెడ్డి పై ఆరోపణలు చుట్టుముట్టాయి. తన ముఖ్య అనుచరుడు, ఆంతరంగికుడు అయిన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అతని స్నేహితుడు కలిసి వెంకటాచలం మండలం అనికేపల్లిలో ఏర్పాటు చేసిన ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్‌కు సంబంధించి వివాదం తెరపైకి వచ్చింది. ఆ లేఅవుట్‌లో వెళుతున్న పైప్‌లైన్ నుంచి నీరు ఇవ్వాలంటూ చేసిన ప్రతిపాదన అనుమతులలో జాప్యం చేస్తున్నారంటూ ఎంపీడీవో సరళా పై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహించారు. గతరాత్రి కల్లూరుపల్లిలోని ఎంపీడీవో సరళ నివాసం వద్ద దౌర్జన్యం చేశారంటూ ఆమె ఆందోళనకు దిగారు. పోలీసు స్టేషన్‌లో బైఠాయించారు. తెల్లవారుజామున ఆయన అనుచరుల పై కేసు నమోదు చేశారు రూరల్ పోలీసులు. ఈ వ్యవహారం ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పై కేసే నమోదు వరకు వెళ్ళింది.
మొన్నటి ఎన్నికలు నాటి నుంచి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఎన్నికలకు ముందు తర్వాత వరుసగా పలువురిని బెదిరింపులు, ఫోన్లులో అసభ్యకరంగా మాట్లాడడం, భౌతిక దాడులకు దిగడం లాంటి ఆరోపణలు వున్నాయి. ఈ ఆరోపణల పై గతంలో వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లాయి. ఆ తరువాత పార్టీ నేరుగా రంగంలోకి దిగి వివాదాలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో వుండాలంటూ అధినేత జగన్ ఆదేశించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెత్తనాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సోదరుడు దినకర్ రెడ్డికి అప్పగించారు. నెలలో కొన్ని రోజులు మాత్రమే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించాలి. మిగతా సమయంలో అమరావతిలో అందుబాటులో వుండాలంటూ వైసీపీ పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు ఇటీవల విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో వరుసగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై ఆరోపణలు చుట్టుముట్టిన నేపథ్యంలో కొన్నాళ్లు ఎమ్మెల్యే సైలంట్ అయ్యారు. నియోజకవర్గానికి కొన్ని రోజులు దూరంగానూ ఉన్నారు. ఇటీవల రొట్టెల పండుగ నుంచి ఎమ్మెల్యే అభివృద్ధి పనుల పై దృష్టి పెట్టారు. వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో బిజీగా మారారు. ఇదే సమయంలో మరోసారి ఎంపీడీవో పై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే వ్యవహారం వివాదస్పదంగా మారింది. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలలోకి వచ్చిన శ్రీధర్ రెడ్డి పై తాజాగా నెలకొన్న వివాదాలపై ఆ పార్టీ అధినాయకత్వం ఎలాగు వ్యవహరించబోతున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు వైసీపీలోను హాట్‌టాపిక్‌గ మారింది.
వివాదాలకు కేరాఫ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆయన ఓ విద్యార్థి ఉద్యమ నాయకుడు ఆల్మట్టి ప్రాజెక్టు వల్ల ఇబ్బందులున్నాయంటూ సుదీర్ఘ పోరాటాలు చేసిన నేత. సాధారణ కుటుంబం నుంచి విద్యార్థి ఉద్యమ నేతగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఎరిగిన వ్యక్తి కూడా. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. రాజకీయంగా ఎలాంటి పూర్వ నేపథ్యం లేకుండా రెండు సార్లు శాసనసభ్యులయ్యారు. అధికారం చేపట్టిన అనంతరం అనుచరుల ప్రభావమో, కేడర్‌కు అండగా వుంటానన్న భరోసా కోసమో గత కొద్ది కాలంగా రాజకీయ వివాదస్పదుడిగా మారారు. ప్రత్యేకించి నెల్లూరు రూరల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌రెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు నుంచే దూకుడు పెంచారు. బెదిరింపులు, హుంకరింపులు, హెచ్చరికలు ఆ పై రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు అంతలోనే వివరణలు ఇలా అడుగడుగునా ఆయన అధికార పార్టీలో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఒకప్పటి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, దివంగత ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల అనుచరుడిగా రాజకీయ మెట్లెక్కి శాసనసభ్యుడిగా ఎదిగిన శ్రీధర్ రెడ్డి రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాలలో వివాదాలకు కేరాఫ్‌గా మారారు. తాజాగా వెంకటాచలం ఎంపీడీవో సరళ పై దౌర్జన్యం చేశారంటూ గత రాత్రి నుంచి శ్రీధర్ రెడ్డి పై ఆరోపణలు చుట్టుముట్టాయి. తన ముఖ్య అనుచరుడు, ఆంతరంగికుడు అయిన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అతని స్నేహితుడు కలిసి వెంకటాచలం మండలం అనికేపల్లిలో ఏర్పాటు చేసిన ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్‌కు సంబంధించి వివాదం తెరపైకి వచ్చింది. ఆ లేఅవుట్‌లో వెళుతున్న పైప్‌లైన్ నుంచి నీరు ఇవ్వాలంటూ చేసిన ప్రతిపాదన అనుమతులలో జాప్యం చేస్తున్నారంటూ ఎంపీడీవో సరళా పై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహించారు. గతరాత్రి కల్లూరుపల్లిలోని ఎంపీడీవో సరళ నివాసం వద్ద దౌర్జన్యం చేశారంటూ ఆమె ఆందోళనకు దిగారు. పోలీసు స్టేషన్‌లో బైఠాయించారు. తెల్లవారుజామున ఆయన అనుచరుల పై కేసు నమోదు చేశారు రూరల్ పోలీసులు. ఈ వ్యవహారం ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పై కేసే నమోదు వరకు వెళ్ళింది. మొన్నటి ఎన్నికలు నాటి నుంచి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఎన్నికలకు ముందు తర్వాత వరుసగా పలువురిని బెదిరింపులు, ఫోన్లులో అసభ్యకరంగా మాట్లాడడం, భౌతిక దాడులకు దిగడం లాంటి ఆరోపణలు వున్నాయి. ఈ ఆరోపణల పై గతంలో వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లాయి. ఆ తరువాత పార్టీ నేరుగా రంగంలోకి దిగి వివాదాలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో వుండాలంటూ అధినేత జగన్ ఆదేశించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెత్తనాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సోదరుడు దినకర్ రెడ్డికి అప్పగించారు. నెలలో కొన్ని రోజులు మాత్రమే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించాలి. మిగతా సమయంలో అమరావతిలో అందుబాటులో వుండాలంటూ వైసీపీ పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు ఇటీవల విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో వరుసగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై ఆరోపణలు చుట్టుముట్టిన నేపథ్యంలో కొన్నాళ్లు ఎమ్మెల్యే సైలంట్ అయ్యారు. నియోజకవర్గానికి కొన్ని రోజులు దూరంగానూ ఉన్నారు. ఇటీవల రొట్టెల పండుగ నుంచి ఎమ్మెల్యే అభివృద్ధి పనుల పై దృష్టి పెట్టారు. వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో బిజీగా మారారు. ఇదే సమయంలో మరోసారి ఎంపీడీవో పై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే వ్యవహారం వివాదస్పదంగా మారింది. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలలోకి వచ్చిన శ్రీధర్ రెడ్డి పై తాజాగా నెలకొన్న వివాదాలపై ఆ పార్టీ అధినాయకత్వం ఎలాగు వ్యవహరించబోతున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు వైసీపీలోను హాట్‌టాపిక్‌గ మారింది.