Tuesday, 18 August 2026
  • Home  
  • మనసున్న మహారాజులు.. సొంత ఖర్చులతో కల్వర్టుకు మరమ్మతులు*
- తిరుపతి

మనసున్న మహారాజులు.. సొంత ఖర్చులతో కల్వర్టుకు మరమ్మతులు*

*ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారులు, నాయకులపై స్థానికుల ఆగ్రహం* తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో పలు ప్రజా సమస్యలపై అధికారులు, కూటమి నాయకుల దృష్టి కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో స్థానికులే తమ సొంత నిధులతో సమస్యలను పరిష్కరించుకుంటున్న పరిస్థితి నెలకొంది. సూళ్లూరుపేట పట్టణంలోని బాబూజీ కాలనీ, శ్రీలక్ష్మి థియేటర్ ప్రాంతంలో రాకపోకలకు ఉపయోగించే రహదారిపై ఇరువైపులా గుంతలు ఏర్పడి చాలా కాలంగా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా కల్వర్టు వద్ద గుంతలు ఏర్పడటంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్థానికులు పలుమార్లు పురపాలక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో రంగారెడ్డి, నేలేంద్ర, బాల సుబ్రహ్మణ్యం, కుట్టి అనే స్థానికులు ముందుకొచ్చారు. ఆదివారం స్థానికులతో కలిసి తమ సొంత నిధులను వెచ్చించి బాబూజీ కాలనీ ప్రాంతంలోని కల్వర్టుకు మరమ్మతులు చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను అధికారులు పట్టించుకోకపోయినా, స్థానికుల ఇబ్బందులను గమనించి తమ సొంత డబ్బుతో మరమ్మతులు చేయించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మానవత్వంతో ముందుకొచ్చిన ఈ నలుగురిని పలువురు అభినందించారు. అయితే ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నాయకులు, ఎన్నికల అనంతరం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కొందరు స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్నపాటి పనులు సైతం సులభంగా జరగాలంటే పలుకుబడి అవసరమవుతోందని, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఇకనైనా గుర్తించి తక్షణమే పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

*ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారులు, నాయకులపై స్థానికుల ఆగ్రహం*
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో పలు ప్రజా సమస్యలపై అధికారులు, కూటమి నాయకుల దృష్టి కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో స్థానికులే తమ సొంత నిధులతో సమస్యలను పరిష్కరించుకుంటున్న పరిస్థితి నెలకొంది.
సూళ్లూరుపేట పట్టణంలోని బాబూజీ కాలనీ, శ్రీలక్ష్మి థియేటర్ ప్రాంతంలో రాకపోకలకు ఉపయోగించే రహదారిపై ఇరువైపులా గుంతలు ఏర్పడి చాలా కాలంగా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా కల్వర్టు వద్ద గుంతలు ఏర్పడటంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యపై స్థానికులు పలుమార్లు పురపాలక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో రంగారెడ్డి, నేలేంద్ర, బాల సుబ్రహ్మణ్యం, కుట్టి అనే స్థానికులు ముందుకొచ్చారు. ఆదివారం స్థానికులతో కలిసి తమ సొంత నిధులను వెచ్చించి బాబూజీ కాలనీ ప్రాంతంలోని కల్వర్టుకు మరమ్మతులు చేపట్టారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను అధికారులు పట్టించుకోకపోయినా, స్థానికుల ఇబ్బందులను గమనించి తమ సొంత డబ్బుతో మరమ్మతులు చేయించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మానవత్వంతో ముందుకొచ్చిన ఈ నలుగురిని పలువురు అభినందించారు.
అయితే ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నాయకులు, ఎన్నికల అనంతరం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కొందరు స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్నపాటి పనులు సైతం సులభంగా జరగాలంటే పలుకుబడి అవసరమవుతోందని, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఇకనైనా గుర్తించి తక్షణమే పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.