టి.జి.ఎస్.డబ్ల్యూ.ఆర్.జెసి/ఎస్ (జి), కల్లూరులో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఘనంగా సన్మానించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో అత్యధిక మార్కులు సాధించిన వి. ప్రణతికి, ప్రథమ సంవత్సరం లో అత్యధిక మార్కులు సాధించిన అమూల్యకు ప్రిన్సిపాల్ మేడమ్ చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల కృషి, పట్టుదల ప్రశంసనీయమని ప్రిన్సిపాల్ తెలిపారు. చదువులో లక్ష్యసాధనతో ముందుకు సాగాలని సూచించారు. ఈ నగదు బహుమతులను ఆర్.ఎస్. నిరంజన్ అందజేయగా, వారి సేవాభావాన్ని కళాశాల యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.



