అన్నమయ్య జిల్లా కేంద్రం డిమాండ్‌తో టోల్‌గేట్ వద్ద నేతల ఆందోళన
రైల్వే కోడూరు, డిసెంబర్ 14 పున్నమి ప్రతినిధి
రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో రైల్వే కోడూరు నియోజకవర్గంలో నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు పట్టణంలోని టోల్‌గేట్ సమీపంలో ఈ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంఘీభావంతో ప్రారంభమైన ఈ ప్రజా ఉద్యమంలో నేడు పలువురు నాయకులు తొలిరోజు దీక్షకు దిగారు.పోతురాజు నవీన్,నార్జల హేమరాజ్, మల్లెం హేమంత్ కుమార్, భువనేశ్వర్ వీరు దీక్షలో కూర్చొని, రాజంపేట జిల్లా సాధన ఆవశ్యకతను తెలియజేశారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తేనే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు పరిపాలన సౌలభ్యం పెరుగుతుందని దీక్షాకారులు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.పార్టీలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని, దీక్షల్లో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.


