Sunday, 14 December 2025
  • Home  
  • కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో భారీ పోలింగ్
- కామారెడ్డి

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో భారీ పోలింగ్

– 18 గ్రామపంచాయతీల్లో సగటు 75 శాతం దాటిన ఓటింగ్ కామారెడ్డి, 11 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని 18 గ్రామపంచాయతీల్లో రెండో సాధారణ గ్రామపంచా యతీ ఎన్నికల్లో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగీం ది. మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 27,061 మంది నమోదు చేసిన ఓటర్లలో 20,365 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో సగటు పోలింగ్ శాతం 75.28గా నమోదైంది.గ్రామాల వారీగా విశేషాలు ఉదయం నుంచే అన్నారం, గిద్ద, గోడుగుమర్రీ తండా, గోల్లపల్లి, జగదాంబ తండా, మోషంపూర్ వంటి గ్రామాల్లో ఓటర్లు బూత్‌లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్నారం గ్రామంలో 2,614 మంది ఓటర్లలో 2,018 మంది ఓటు వేయ డంతో 77.20 శాతం, గిద్దలో 1,655 మందిలో 1,225 ఓట్లు పడటంతో 74.02 శాతం, గోడుగుమ ర్రీ తండాలో 2,253 మందిలో 1,687 మంది ఓటు వేసి 74.86 శాతం పోలింగ్ నమోదైంది.గొల్లపల్లి లో 86 శాతం దాటగా, జగదాంబ తండా, మోషం పూర్, ఉప్పల్వాయి గ్రామాల్లో కూడా 80 శాతం దాటిన పోలింగ్ శాతం నమోదు కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.రామారెడ్డిలో రికార్డు స్థాయి ఓటింగ్ మండల కేంద్రం రామారెడ్డి గ్రామంలో ఓటర్లు రికార్డు స్థాయిలో బూత్‌లకు తరలివచ్చా రు. 2,655 మంది నమోదు చేసిన ఓటర్లలో 2,532 మంది ఇప్పటికే ఓటు వేశారు, దీంతో మధ్యాహ్నం 1 గంట కల్లా 95.36 శాతం పోలింగ్ నమోదు అయ్యి మండలంలోనే అత్యధికంగా నిలిచింది. రంగంపేట, రెడ్డిపేట్, స్కూల్ తండాలో కూడా 70 శాతానికి పైగా ఓటింగ్ నమోదవడంతో స్థానిక అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.ప్రశాంత వాతావరణంలో పోలింగ్మొత్తం మండలంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుండ గా, ఎలాంటి అపశ్రుతులు నమోదు కావడం లేదు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా దళాలుమోహరిం చడంతో పాటు, ఎన్నికల అధికారులు కేంద్రాలను సందర్శిస్తూ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఓటర్ల సౌకర్యార్థం తాగునీటి, షెడ్లు, ప్రత్యేక వరుసలు వంటి ఏర్పాట్లు ఉండటంతో మహిళలు, వృద్ధులు కూడా నిరభ్యంతరంగా తమ ఓటు హక్కు వినియోగిస్తున్నారు.సాయంత్రం వరకు మరింత పెరుగనున్న పోలింగ్ఇప్పటికే మూడు వంతులకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోవడం ఎన్నికల ఉత్సాహానికి నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాయంత్రం వరకు ఓటర్ల రద్దీ ఈ వేగంతో కొనసాగితే, మొత్తం మండలంలో పోలింగ్ శాతం 85 నుంచి 90 శాతం వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామస్థాయిలో అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, నాయకులపై నమ్మకం వంటి అంశాలపై ప్రజలు తీర్పు ఇవ్వడాని కి భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం ప్రజాస్వామ్య స్పూర్తిని చాటుతుంది.

– 18 గ్రామపంచాయతీల్లో సగటు 75 శాతం దాటిన ఓటింగ్

కామారెడ్డి, 11 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని 18 గ్రామపంచాయతీల్లో రెండో సాధారణ గ్రామపంచా యతీ ఎన్నికల్లో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగీం ది. మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 27,061 మంది నమోదు చేసిన ఓటర్లలో 20,365 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో సగటు పోలింగ్ శాతం 75.28గా నమోదైంది.గ్రామాల వారీగా విశేషాలు ఉదయం నుంచే అన్నారం, గిద్ద, గోడుగుమర్రీ తండా, గోల్లపల్లి, జగదాంబ తండా, మోషంపూర్ వంటి గ్రామాల్లో ఓటర్లు బూత్‌లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్నారం గ్రామంలో 2,614 మంది ఓటర్లలో 2,018 మంది ఓటు వేయ డంతో 77.20 శాతం, గిద్దలో 1,655 మందిలో 1,225 ఓట్లు పడటంతో 74.02 శాతం, గోడుగుమ ర్రీ తండాలో 2,253 మందిలో 1,687 మంది ఓటు వేసి 74.86 శాతం పోలింగ్ నమోదైంది.గొల్లపల్లి లో 86 శాతం దాటగా, జగదాంబ తండా, మోషం పూర్, ఉప్పల్వాయి గ్రామాల్లో కూడా 80 శాతం దాటిన పోలింగ్ శాతం నమోదు కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.రామారెడ్డిలో రికార్డు స్థాయి ఓటింగ్ మండల కేంద్రం రామారెడ్డి గ్రామంలో ఓటర్లు రికార్డు స్థాయిలో బూత్‌లకు తరలివచ్చా రు. 2,655 మంది నమోదు చేసిన ఓటర్లలో 2,532 మంది ఇప్పటికే ఓటు వేశారు, దీంతో మధ్యాహ్నం 1 గంట కల్లా 95.36 శాతం పోలింగ్ నమోదు అయ్యి మండలంలోనే అత్యధికంగా నిలిచింది. రంగంపేట, రెడ్డిపేట్, స్కూల్ తండాలో కూడా 70 శాతానికి పైగా ఓటింగ్ నమోదవడంతో స్థానిక అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.ప్రశాంత వాతావరణంలో పోలింగ్మొత్తం మండలంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుండ గా, ఎలాంటి అపశ్రుతులు నమోదు కావడం లేదు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా దళాలుమోహరిం చడంతో పాటు, ఎన్నికల అధికారులు కేంద్రాలను సందర్శిస్తూ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఓటర్ల సౌకర్యార్థం తాగునీటి, షెడ్లు, ప్రత్యేక వరుసలు వంటి ఏర్పాట్లు ఉండటంతో మహిళలు, వృద్ధులు కూడా నిరభ్యంతరంగా తమ ఓటు హక్కు వినియోగిస్తున్నారు.సాయంత్రం వరకు మరింత పెరుగనున్న పోలింగ్ఇప్పటికే మూడు వంతులకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోవడం ఎన్నికల ఉత్సాహానికి నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాయంత్రం వరకు ఓటర్ల రద్దీ ఈ వేగంతో కొనసాగితే, మొత్తం మండలంలో పోలింగ్ శాతం 85 నుంచి 90 శాతం వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామస్థాయిలో అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, నాయకులపై నమ్మకం వంటి అంశాలపై ప్రజలు తీర్పు ఇవ్వడాని కి భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం ప్రజాస్వామ్య స్పూర్తిని చాటుతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.