(పున్నమి ప్రతినిధి)*
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను మర్రిపాడు మండల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నాగేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగులలో అంతర్గతంగా ఎన్నో దివ్యమైన శక్తులు దాగి ఉంటాయని,వాటిని వెలికి తీయడానికి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు కృషిచేయాలని అన్నారు.ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు తిరుపతయ్య,ధనలక్ష్మి,ఫిజియోథఫీ వైద్యులు రఫీ,రిసోర్స్ పర్సన్ రాజేంద్రకుమార్,సహిత విద్య ఉపాధ్యాయులు రషీద్,విజయలక్ష్మి,సీ.ఆర్.ఎం.టీ ఉపాధ్యాయులు,మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది,తల్లిదండ్రులు,దివ్యాంగ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


