కామారెడ్డి, 3 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ మండలం, లింగం పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమృత రవళి రాజేందర్ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పోస్ట్ గ్రాజ్యువేట్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎకనామిక్స్, MBA, B.Ed విద్యార్హతలు కలిగిన ఆయన, గత 7 సంవ త్సరాలుగా సమాజ సేవలో నిమగ్నంగా ఉన్నారు. ఈ మేనిఫెస్టోలో గ్రామ అభివృద్ధి, సంక్షేమం, మౌలి క సదుపాయాలపై 25కి పైగా హామీలు ఇచ్చారు .కీలక సంక్షేమ హామీలు18 నుంచి 70 సంవత్సరా ల వయస్సు ఉన్నవారికి ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా.ఆడపిల్ల పుడితే రూ.2,000 బంగా రు తల్లి కింద ఆర్థిక సహాయం చేసి ఫిక్స్‌డ్ డిపాజి ట్‌లో పెట్టడం.కులాలు అతీతంగా ఎవరైనా చనిపో తే దహన సంస్కారాలకు రూ.5,000 సహాయం .ప్రతి కుటుంబానికి మినరల్ వాటర్ స్థాయి మంచి నీటి సౌకర్యం.మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్, వైకుంఠ ధామంలో మౌలిక సదుపాయాలు ఏర్పా టు.మురుగు నీటి డ్రైనేజ్ వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, శివాలయం వరకు రోడ్లు, సోలార్ లైట్లు. పాఠశాల ను పరిశుభ్రంగా మార్చడం, విద్యార్థులకు ఆటస్థలం, వ్యాయామ శాల, అన్ని సౌకర్యాలతో గ్రంథాల యం.పూర్తి వీధుల్లో సిమెంట్ రోడ్లు, పాడి ఉత్పత్తి సహకారం. ఆరోగ్యం, యువత, పర్యావరణంనెలకు ఒకసారి హెల్త్ క్యాంప్‌లు, నెహ్రూ యువ కేంద్రం సేవలు. యువతకు నైపుణ్య శిక్షణ, కృషి-ఉపాధి అవకాశా లు, స్వయం ఉపాధికి బ్యాంకుల సహకారం. పర్యా వరణ పరిరక్షణకు హరితవానలు, జలసంర క్షణ, ఆర్గానిక్ వ్యవసాయం ప్రోత్సాహం.పోటీ పరీక్షలకు ఉచిత వైఫై, పుస్తకాలు; పీఎం ఆవాస్ యోజనలు అమలు.పారదర్శకత, బాధ్యతహామీలు నెరపక పోతే ఓటర్లకు తనను నిలదీసే హక్కు ఇచ్చిన రాజేందర్ , పంచాయతీ నిధులపై 90 రోజులకు ఒకసారి గ్రామసభలు నిర్వహిస్తానని, ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చేస్తానని చెప్పారు. పురాతన కట్టడాలు, దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని, CSR, స్వచ్ఛంద సంస్థల సహకారం తో నిధుల సమీకరణ చేస్తానని తెలిపారు. గ్రామా న్ని జిల్లాలో మొదటి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దు తానని ప్రార్థించారు.


